Long Hair: జుట్టు మోకాళ్ల వరకు పెరగాలంటే ఈ 7 బయోటీన్‌ ఉండే ఆహారాలు తినాల్సిందే..

Biotin Rich Foods For Biotin: బయోటిన్ అనేది జుట్టు, గోళ్లు పెరుగుదలకు ఎంతో ముఖ్యం. ఈ విటమిన్ డైట్‌లో ఉంటే జుట్టు ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది. కొన్ని ఆహారాలలో సహజసిద్ధంగా బయోటీన్‌ ఉంటుంది. అవి ఏంటో తెలుసుకుందాం

Written by - Renuka Godugu | Last Updated : Apr 6, 2025, 07:36 PM IST
Long Hair: జుట్టు మోకాళ్ల వరకు పెరగాలంటే ఈ 7 బయోటీన్‌ ఉండే ఆహారాలు తినాల్సిందే..

Biotin Rich Foods For Biotin: జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఈ నేపథ్యంలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు డైట్‌లో చేర్చుకోవాలి. ఇది కాకుండా సరైన హెయిర్ కేర్ రొటీన్‌ కూడా పాటించాలి. తద్వారా జుట్టు ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది. కుదుళ్లు నుంచి దృఢంగా మారుతుంది. అయితే మన జుట్టు పెరుగుదలకు బయోటిన్ ఎంతో కీలకం. దీన్ని విటమిన్ బి7 అని కూడా పిలుస్తారు. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు చర్మం, గోళ్ళకు ఇది ఎంతో ముఖ్యమైన విటమిన్ అని చెప్పాలి. అయితే సహజసిద్ధంగా బయోటీన్‌ ఉండే కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవి మన డైట్‌లో చేర్చుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

Add Zee News as a Preferred Source

బాదం..
బాదం డైట్‌లో  చేర్చుకుంటే మనకు బయోటీన్‌ అందినట్టే. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. మంచి స్నాక్ లేదా స్మూతీల్లో వేసుకొని తీసుకోవచ్చు. 

వాల్ నట్స్ ..
మన రెగ్యులర్‌గా వాల్‌నట్స్‌ నానబెట్టి తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి బయటీన్‌, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. దీంతో జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది కూడా. దీన్ని స్మూథీల్లో కూడా వేసుకొని తీసుకోవచ్చు. 

సన్‌ఫ్లవర్ గింజలు..
సన్‌ఫ్లవర్ గింజలు తీసుకోవడం వల్ల ఇందులో బయోటీన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఖనిజాలు కూడా ఉంటాయి. వీటిని సలాడ్‌లో చల్లుకొని తీసుకోవాలి. పెరుగు లేదా ఓట్మీల్‌లో కూడా వేసుకొని తీసుకోవచ్చు. జుట్టును బలంగా మారుస్తుంది.

స్వీట్ పొటాటో..
ఇందులో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. బయోటీన్‌ కూడా ఉంటుంది. ఇందులో బీటా కెరోటీన్‌ కూడా ఉంటుంది. ఇది విటమిన్ ఏ గా మారుస్తుంది. తద్వారా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. చిలకడదుంపను ఉడికించి తీసుకోవచ్చు. లేదా సూప్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

పాలకూర..
పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో బయోటిన్ కూడా ఉంటుంది. కూరల రూపంలో తీసుకోవచ్చు. లేదా స్మూథీలా తీసుకోవడం వల్ల మన జుట్టుకు బయోటిన్ అందుతుంది.

అరటిపండు..
అరటిపండు రుచిగా ఉంటుంది. ఇందులో బయోటీన్‌ కూడా పుష్ప బలంగా ఉంటుంది. స్మూథీ లేదా నేరుగా కూడా తినవచ్చు. అరటిపండును రెగ్యులర్‌గా తీసుకున్నా లేకపోతే దీంతో హెయిర్ ప్యాక్ వేసుకున్నా కానీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది .

ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. ఈరాశికి కుటుంబ సమస్యల నుంచి కాస్త ఉపశమనం..  

 అవకాడో..
 అవకాడోలో బయోటీన్‌ ఉంటుంది. అవకాడో తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరానికి అందుతాయి రూపంలో తీసుకోవచ్చు. లేదా సలాడు జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. తద్వారా ఒక జుట్టు బలంగా మారుతుంది.

ఇదీ చదవండి:  అత్తపై కోడలి దాష్టీకం.. వృద్ధాశ్రమానికి వెళ్లలేదని.. వీడియో వైరల్‌..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News