Black Carrot Health Benefits: మార్కెట్‌లో మనం తరుచుగా క్యారెట్‌లను చూస్తుంటాము. ఇది చూడడానికి ఆరెంజ్ రంగులో ఉంటుందని మనకు తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా నలుపు రంగులో ఉండే క్యారెట్‌ను చూసారా? మీరు విన్నది నిజమే నలుపు రంగులో కూడా క్యారెట్‌లు ఉంటాయి. ఇవి ఆరెంజ్ రంగులో ఉండే క్యారెట్ కంటే అధిక లాభాలు, పోషకాలు కలిగి ఉంటాయి. ఈ క్యారెట్ మన ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుంది అనేది మనం తెలుసుకుందాం.
బ్లాక్ క్యారెట్లలో ఆంథోసైనిన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తుంది. దీని కారణంగా ఇది ముదురు ఊదా రంగులో ఉంటుంది. ఈ క్యారెట్ ఉపయోగించడం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని అడ్డుకోవచ్చు. ఫ్రీ రాడికల్స్ వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలుగుతాయి. బ్లాక్ క్యారెట్ వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకోండి.
బ్లాక్ క్యారెట్ ఆరోగ్య లాభాలు:
గుండె ఆరోగ్యంగా: బ్లాక్ క్యారెట్లలోని ఆంథోసైనిన్స్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెంచడంలో మేలు చేస్తాయి. దీని వల్ల గుండె సంబంధిత సమస్య బారిన పడకుండా ఉంటాము.
క్యాన్సర్ కు చెక్: ఆరోగ్యనిపుణుల ప్రకారం బ్లాక్ క్యారెట్ల తినడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా పెద్దప్రేగు క్యాన్సర్ , రొమ్ము క్యాన్సర్ సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు.
కంటి చూపు: బీటా-కెరోటిన్, విటమిన్ A బ్లాక్ క్యారెట్ లో అధికంగా ఉంటుంది. దీని వల్ల రేచీకటి, వయస్సు సంబంధిత కంటి సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు.
ఆంథోసైనిన్స్ కూడా కళ్ళలోని రక్తనాళాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
రోగనిరోధక శక్తి: విటమిన్ సి బ్లాక్ క్యారెట్లలో అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక ప్రాత పోషిస్తుంది. దీని వల్ల ఎలాంటి అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటాము.
జీర్ణక్రియవ్యవస్థ: బ్లాక్ క్యారెట్లలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడంలో, ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది.
చర్మ ఆరోగ్యానికి: బ్లాక్ క్యారెట్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి. ఇది చర్మం ముడతలు పడకుండా, వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ A చర్మ కణాల పునరుత్పత్తి చేస్తాయి.
మధుమేహం: బ్లాక్ క్యారెట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
శరీరానికి శక్తినిస్తాయి: బ్లాక్ క్యారెట్లు సహజ చక్కెరలను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే బరువు పెరగకుండా శక్తిని పొందడానికి ఇది ఒక ఆరోగ్యకరమైన ఎంపిక.
బ్లాక్ క్యారెట్లను ఎలా తీసుకోవాలి:
పచ్చిగా: వీటిని నేరుగా కడిగి తినవచ్చు లేదా సలాడ్‌లలో ఉపయోగించవచ్చు.
వండినవి: వీటిని కూరలు, సూప్‌లు మరియు ఇతర వంటకాల్లో ఉపయోగించవచ్చు.
జ్యూస్: వీటిని జ్యూస్ చేసి కూడా తాగవచ్చు.
పికిల్: వీటితో ఊరగాయ కూడా తయారు చేస్తారు.
బ్లాక్ క్యారెట్లు సాధారణ క్యారెట్లతో పోలిస్తే కొద్దిగా భిన్నమైన రుచిని కలిగి ఉంటాయి, కొంచెం తీపి రుచిని కలిగి ఉంటాయి. మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









