Black Raisins Benefits In Telugu: ప్రతి రోజు నల్ల ఎండుద్రాక్షను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో శరీరానికి అవసరమైన ఐరన్‌తో పాటు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు నల్ల ఎండు ద్రాక్షను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ ఎండు ద్రాక్షలో కాపర్‌తో పాటు జింక్, థయామిన్ (B1), రైబోఫ్లావిన్ (B2), నియాసిన్ (B3), పిరిడాక్సిన్ (B6) వంటి విటమిన్లు లభిస్తాయి. ఇందులో విటమిన్ Kతో పాటు సి కూడా లభిస్తుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు సహాయపడుతుంది.
నల్ల ఎండుద్రాక్ష వల్ల కలిగే లాభాలు:
శక్తిని పెంచుతుంది:
నల్ల ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రక్టోజ్) పుష్కలంగా లభిస్తుంది. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా నీరసంగా లేదా అలసిపోవడం వంటి సమస్యలతో బాధపడేవారు నల్ల ఎండుద్రాక్షలను తినడం వల్ల తక్షణ శక్తిని కూడా పొందుతారు.
రక్తహీనత సమస్యలు:
ఐరన్ లోపం వల్ల చాలా మందిలో రక్తహీనత వంటి సమస్యలు వస్తున్నాయి. ప్రతి రోజు నల్ల ఎండుద్రాక్షను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. తరచుగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు నల్ల ఎండు ద్రాక్షను చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు.
ఎముకల సమస్యలు:
నల్ల ఎండుద్రాక్షలో కాల్షియంతో పాటు బోరాన్ వంటి ఖనిజాలు లభిస్తాయి.. ప్రతి రోజు ఎండుద్రాక్ష తింటే శరీరాని తగిన మోతాదులో కాల్షియం లహించి.. దీని వల్ల ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎముకలతో పాటు బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నవారు ప్రతి రోజు తప్పకుండా నల్ల ఎండుద్రాక్షను తీసుకోవాల్సి ఉంటుంది.
జీర్ణక్రియ సమస్యలు:
నల్ల ఎండుద్రాక్షలో ఫైబర్ అధిక మోతాదులో లభిస్తుంది.. ఇది మలబద్ధకాన్ని నివారించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. క్రమం తప్పకుండా నల్ల ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. దీంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా దూరమవుతాయి.
రోగనిరోధక శక్తి:
నల్ల ఎండుద్రాక్షలో విటమిన్ సితో పాటు యాంటీఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో బాధపడేవారు ప్రతి రోజు ఎండుద్రాక్షను తినడం చాలా మంచిది.
కంటి ఆరోగ్యం:
నల్ల ఎండుద్రాక్షలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కంలగా లభిస్తాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడానికి, వయస్సు సంబంధిత కంటి సమస్యల నుంచి రక్షించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా నల్ల ఎండుద్రాక్ష తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









