Black Rice Benefits In Winter Season: చాలా మంది మార్కెట్లో బ్లాక్ రైస్ చూస్తూ ఉంటారు. ఇవి ఇతర రైస్‌ల కంటే అతంగా రుచి ఉండవని తినేందుకు ఎక్కువగా ఇష్టపడరు. నిజానికి ఈ రైస్ శరీరానికి ఇతర రైస్‌ల కంటే అద్భుతమైన పోషకాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి అద్బుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించేందుకు కూడా సహాయపడుతుంది. మధుమేహంతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా ఈ బ్లాక్ రైస్ తినడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించుకొవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బ్లాక్ రైస్ తినడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు:
యాంటీఆక్సిడెంట్ల మూలం:
బ్లాక్ రైస్‌లో శరీరానికి కావాల్సిన ఆంథోసైనిన్లు అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా శరీరంలోని కణాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే వాపులు ఇతర సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు క్యాన్సర్ల కూడా రాకుండా ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు.
గుండె ఆరోగ్యానికి మేలు:
బ్లాక్ రైస్‌లోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో పెరిగిన చెడు కొవ్వును తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రక్తపోటును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ బ్లాక్ రైస్ తింటే గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి.
మధుమేహానికి చెక్:
టైప్-2 డయాబెటిస్తో బాధపడుతున్నవారు ప్రతి రోజు బ్లాక్ రైస్ తినడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇందులో ఉండే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా మధుమేహాన్ని కూడా సులభంగా నియంత్రిస్తుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తప్పకుండా బ్లాక్ రైస్ తినండి.
జీర్ణ వ్యవస్థకు మేలు:
బ్లాక్ రైస్‌లోని ఫైబర్ ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది. ఇది మలబద్ధకాన్ని నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. తరచుగా అజీర్ణం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఈ బ్లాక్ రైస్ తినడం వల్ల సులభంగా వాటి నుంచి విముక్తి పొందుతారు. అలాగే జీర్ణ వ్యవస్థను కూడా దృఢంగా చేస్తాయి.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
బరువు తగ్గడానికి:
బ్లాక్ రైస్‌లోని లభించే ఫైబర్ పొట్టను నిండుగా చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఆకలిని కూడా నియంత్రిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు తింట సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే కొవ్వు కూడా సులభంగా నియంత్రణలోకి వస్తుంది.
కంటి ఆరోగ్యానికి మేలు:
బ్లాక్ రైస్‌లోని యాంటీఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని రక్షించేందుకు కూడా ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.. ఇది మాక్యులర్ డిజీజ్తో పాటు గ్లాకోమా వంటి కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?