Blood Clots During Period: సాధారణంగా మహిళలకు ప్రతి నెలా పీరియడ్స్ వస్తూంటాయి. ఈ సమయంలో చాలా వరకు రక్తం పోతుంది. అయితే పిరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, వెన్ను నొప్పి, మూడ్ స్వింగ్స్, వాంతులు, తలనొప్పి వంటి ఇతర సమస్యల బారిన పడుతుంటారు. దీని కారణంగా చికాకుగా, అలసట, నీరసం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆరోగ్యనిపుణులు ప్రకారం పిరియడ్స్ మూడు నుంచి ఐదు లేదా ఏడు రోజు పాటు ఉంటుంది. ఈ సమయంలో రక్త స్రావం జరుగుతూ ఉంటుంది. ఇది సహజమైన ప్రక్రియ అని చెబుతున్నారు. అయితే కొంతమంది ఈ పిరియడ్స్ సమయంలో రక్తం గడ్డలు కట్టిపడటం అనేది జరుగుతుంది. మనలో చాలా మంది ఇది ఒక వ్యాధికి సంబంధించినదా అనే అనుమానం ఉంటుంది. ఇవి అసలు ఎందుకు వస్తాయి. అనేది మనం తెలుసుకుందాం.
పీరియడ్స్ సమయంలో రక్తం గడలుగా మారుతుంది. దీనిని బ్లడ్ క్లాట్స్ అని పిలుస్తారు. కొన్ని సార్లు జెల్‌లాగా ఉంటుంది. ఇది రుతుస్రాం టైమ్‌లో బయటకు వచ్చే ఒక కణజాలం అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది భయంకరమైన వ్యాధికి సంతేకం మాత్రం కాదని వారు చెబుతున్నారు. కానీ ప్రతినెలా గడ్డల రూపంలో రక్తం పడుతుంటే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. రక్తం అలా గడ్డలగా మారుతుంది అంటే శరీరంలో రక్తం లేకపోవడం, అధికంగా రక్తస్రావంకు అర్థం ఇతర కారణాలకు ఇది సూచినలు ఇస్తుంది.
రక్తం గడ్డకట్టడానికి కారణాలు:
1. ఫైబ్రినోజెన్ అధికంగా ఉండటం:
రక్తంలో ఫైబ్రినోజెన్ అనే ఒక ప్రోటీన్ ఎక్కువగా ఉంటే అది గడ్డకట్టడాన్ని వేగవంతం చేస్తుంది. హార్మోన్ల మార్పులు, వయస్సు, గర్భం, ఊబకాయం వంటి అనేక కారకాల వల్ల ఫైబ్రినోజెన్ స్థాయిలు పెరుగుతాయి.
2. ఫైబ్రినోలిసిస్ లోపం:
ఫైబ్రినోలిసిస్ అనేది రక్త గడ్డలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియ. ఈ ప్రక్రియ సరిగ్గా పనిచేయకపోతే, గడ్డలు పెద్దవిగా మరింత స్థిరంగా మారతాయి. కొన్ని మందులు, వైద్య పరిస్థితులు, జన్యుపరమైన లోపాలు ఫైబ్రినోలిసిస్ లోపానికి కారణం కావచ్చు.
3. ప్లేట్‌లెట్‌ల అధిక చురుకుదనం:
ప్లేట్‌లెట్‌లు రక్తం గడ్డకట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి చాలా చురుకుగా ఉంటే అవి అవసరం లేని సమయంలో కూడా గడ్డకట్టడం ప్రారంభించవచ్చు. కొన్ని మందులు, వైద్య పరిస్థితులు, జన్యుపరమైన లోపాలు ప్లేట్‌లెట్‌ల అధిక చురుకుదనానికి కారణం కావచ్చు.
4. రక్త నాళాల లోపాలు:
రక్త నాళాలు సరిగ్గా పనిచేయకపోతే, అవి రక్తం గడ్డకట్టడాన్ని సులభతరం చేస్తాయి. గాయాలు, వ్యాధులు, జన్యుపరమైన లోపాలు రక్త నాళాల లోపాలకు కారణం కావచ్చు.
5. హార్మోన్ల అసమతుల్యత:
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిలలో మార్పులు రక్త గడ్డకట్టడాన్ని ప్రభావితం చేస్తాయి. హార్మోన్ల చికిత్స, గర్భం, రుతువిరతి వంటి అనేక కారకాల వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు.
6. మందులు:
కొన్ని మందులు, ముఖ్యంగా హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ, గర్భనిరోధక మాత్రలు, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతాయి.
7. ధూమపానం:
ధూమపానం రక్త నాళాలను దెబ్బతీస్తుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది.
8. స్థూలకాయం:
స్థూలకాయం రక్తంలో ఫైబ్రినోజెన్ ఇతర గడ్డకట్టే కారకాల స్థాయిలను పెంచుతుంది.
9. నిశ్చల జీవనశైలి:
నిశ్చల జీవనశైలి రక్త ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









