Red Cells: శరీరంలో ఎర్ర రక్త కణాల పాత్ర ఏమిటీ? అవి పెరగాలంటే ఏం తినాలి?

Red Cells Increase Tips In Telugu: శరీరంలో రక్తం అనేది చాలా ముఖ్యమైన ద్రవం. రక్తం లేకుంటే ప్రాణం నిలవదు. రక్తంలో ఉండే రక్త కణాల్లో ఎర్ర రక్తకణాలు చాలా ముఖ్యమైనవి. అవి తగ్గకుండా పెరగడానికి ఇవి చేయాలి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 18, 2025, 02:40 PM IST
Red Cells: శరీరంలో ఎర్ర రక్త కణాల పాత్ర ఏమిటీ? అవి పెరగాలంటే ఏం తినాలి?

Red Cells Increase: శరీరంలో అధిక మొత్తంలో రక్తం ఉంటుంది. రక్తం అనేది శరీరమంతా ప్రహిస్తూ ప్రాణ వాయువు ఆక్సిజన్ అందిస్తుంది. రక్తం లోపిస్తే అనేక రోగాలు వస్తాయి. మ‌న శ‌రీరంలో హిమోగ్లోబిన్ ఎర్ర ర‌క్త క‌ణాల్లో ఉంటుంది. ఇది ఒక ప్రోటీన్‌. ఐర‌న్ స‌హాయంతో హిమోగ్లోబిన్ ఊపిరితిత్తుల్లో ఉండే ఆక్సిజ‌న్‌ను గ్ర‌హించి శ‌రీర భాగాల‌కు చేర‌వేస్తుంది. మ‌ళ్లీ శ‌రీర భాగాల్లో ఉండే కార్బ‌న్ డ‌యాక్సైడ్‌ను తీసుకుని ఊపిరితిత్తుల‌కు చేర వేస్తుంది. అంతేకాకుండా ర‌క్తంలో ఉండే పోష‌కాల‌ను కూడా క‌ణాల‌కు అందిస్తుంది. ఇలా హిమోగ్లోబిన్ మ‌న శ‌రీరంలో విధుల‌ను నిర్వ‌హిస్తుంది. అయితే శ‌రీరంలో త‌గినంత ఐర‌న్ లేక‌పోతే హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తి కాదు. దీంతో శ‌రీర భాగాల‌కు ఆక్సిజ‌న్ స‌రిగ్గా ల‌భించ‌దు. ఫ‌లితంగా శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది. అలాగే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య కూడా వ‌స్తుంది. క‌నుక శ‌రీరంలో హిమోగ్లోబిన్ త‌గిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అయితే ప‌లు ర‌కాల ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల హిమోగ్లోబిన్ స్థాయిల‌ను పెంచుకోవ‌చ్చు.

Add Zee News as a Preferred Source

Also Read: Ginger Benefits: అల్లంతో ఈ రోగాలు అన్ని మాయం.. లాభాలు ఇవే!!

యాపిల్‌, దానిమ్మ పండ్లు
యాపిల్ పండ్ల‌లో విట‌మిన్ సి, ఐర‌న్ అధికంగా ఉంటాయి. అందుక‌ని రోజుకు ఒక యాపిల్ ను తింటే కావ‌ల్సినంత ఐర‌న్ ల‌భిస్తుంది. మ‌న శ‌రీరం ఈ ఐర‌న్‌ను శోషించుకుంటుంది. దీంతో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే దానిమ్మ పండ్ల‌నుకూడా తిన‌వ‌చ్చు. ఈ పండ్ల‌లోనూ ఐర‌న్‌, విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎర్ర ర‌క్త క‌ణాల‌ ఉత్ప‌త్తిని పెంచుతాయి. దీంతో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అర‌టి పండ్ల‌లోనూ ఐర‌న్ ఎక్కువ‌గానే ఉంటుంది. అలాగే ఈ పండ్ల‌లో విట‌మిన్ బి6 ఎక్కువ‌గా ఉంటుంది. ఇవి హిమోగ్లోబిన్ త‌యారీకి దోహ‌దం చేస్తాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ పెరుగుతాయి.

Also Read: Fruit Salad: వేసవిలో ఈ ఫ్రూట్‌ సలాడ్‌ తింటే ఫుల్‌ ఎనర్జీ.. మీరు ట్రై చేయండి

నారింజ పండ్లు
నారింజ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మ‌నం తిన్న ఆహారాల్లో ఉండే ఐరన్‌ను శ‌రీరం శోషించుకునేలా చేస్తుంది. దీంతో హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. జామ పండ్ల‌లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. ఐర‌న్ కూడా వీటి ద్వారా స‌మృద్ధిగానే ల‌భిస్తుంది. ఇవి ఎర్ర ర‌క్త క‌ణాల త‌యారీకి దోహదం చేస్తాయి. దీని వ‌ల్ల హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ పెరుగుతాయి. స్ట్రాబెర్రీల‌లో విట‌మిన్ సి, ఐర‌న్ అధికంగా ఉంటాయి. వీటిని తింటే శ‌రీరం ఐర‌న్‌ను ఎక్కువ‌గా శోషించుకుంటుంది. ఇది హిమోగ్లోబిన్ త‌యారీకి ఉప‌యోగ‌ప‌డుతుంది.

పుచ్చ‌కాయ‌లు
పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని వేడి త‌గ్గ‌డ‌మే కాదు, ఇంకా అనేక ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. పుచ్చ‌కాయ‌ల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఐర‌న్‌, విట‌మిన్ సీ కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. పుచ్చ‌కాయ‌ల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తిని పెంచ‌వ‌చ్చు. దీంతో ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తి కూడా పెరుగుతుంది. కివి పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మ‌నం తిన్న ఆహారంలో ఉండే ఐర‌న్‌ను శ‌రీరం శోషించుకునేలా చేస్తుంది. దీని వ‌ల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇలా ప‌లు ర‌కాల ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల హిమోగ్లోబిన్ స్థాయిల‌ను పెంచుకోవ‌చ్చు. దీంతో జీవ‌క్రియలు స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌బ‌డ‌తాయి. ఆరోగ్యంగా ఉంటారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News