Bottle Gourd Juice Benefits: సొరకాయలో అద్భుతమైన ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి వారంలో ఒక్కరోజైనా దీనితో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో లభించే ఖనిజాలు, ఫైబర్ అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు సహాయపడుతుంది. అలాగే సోరకాయతో చేసిన రసం తాగడం వల్ల వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రతి రోజు వేసవిలో ఈ రసం తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా తొలగిపోతాయి. అయితే ఈ రసం తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో సొరకాయ రసం తాగడం వల్ల కలిగే లాభాలు:
శరీరానికి చల్లదనం:
సొరకాయ రసం సహజమైన శీతలీకరణ లక్షణాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు అల్పాహారానికి ముందు ఈ రసం తాగడం వల్ల వేసవి కాలంలో శరీరంలోని వేడి తగ్గుతుంది. అంతేకాకుండా డీహైడ్రేషన్ నుంచి కూడా ఉపశమనం కలుగుతుతుంది. ఇది శరీరాన్ని లోపలి నుంచి చల్లగా చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వేడి శరీరం వారు తప్పకుండా సోరకాయ రసం తాగండి.
జీర్ణక్రియ సమస్యలు:
సొరకాయ రసంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకంతో పాటు ఇతర జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు ఈ రసం తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా సొరకాయ రసం తాగడం వల్ల ప్రేగు కదలికలు సులభమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బరువు తగ్గడానికి:
సొరకాయ రసంలో కేలరీలు తక్కువగా మోతాదులో లభిస్తాయి. ఇందులో నీరు అధికంగా ఉంటుంది. ఇది కడుపును నిండుగా ఉంచేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఎక్కువగా ఆహారం తీసుకోనివ్వకుండా సహాయపడుతుంది. దీని వల్ల ఎంతో సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి కూడా సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యం కోసం:
సొరకాయ రసం రక్తపోటును నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా సులభంగా తగ్గిస్తుంది. దీని వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా సులభంగా తగ్గుతుంది. ఇందులో లభించే పొటాషియం రక్త నాళాలను మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది. దీంతో కారణంగా తీవ్ర గుండె సమస్యలు కూడా దూరమవుతాయి.
మూత్రపిండాల సమస్యలకు చెక్:
సొరకాయ రసంలో అద్భతమైన పోషకాల లభిస్తాయి. ఇవి సహజ మూత్రవిసర్జనకారిగా క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపించేందుకు కూడా సహాయపడుతుంది. దీంతో పాటు మూత్రపిండాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీంతో వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









