Angry Synonyms In Telugu: చాలామందిలో చీటికిమాటికి కోపం వస్తూ ఉంటుంది. నిజానికి ఇదొక పెద్ద వ్యాధికి లక్షణం అని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్ కారణంగా కూడా కొంతమందిలో ఇలాంటి సమస్య రావచ్చని వారు అంటున్నారు. కొన్నిసార్లు ట్రైన్ లోని సాధారణ గడ్డల ద్వారా కూడా క్యాన్సర్ వస్తూ ఉంటుంది. చాలామందిలో మొదట కణితి ఏర్పడినప్పుడు ఎలాంటి లక్షణాలు బయటపడవు. కానీ కొంతమందిలో చివరి దశకు చేరినప్పుడు బాడీలో లక్షణాలు వస్తూ ఉంటాయి. అయితే బ్రెయిన్ ట్యూమర్ ప్రారంభ దశను కూడా ఎంతో సులభంగా గుర్తించవచ్చు అని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని ఎలా గుర్తించాలో ఎలాంటి లక్షణాలు బాడీలో వస్తాయో? నిపుణులు ఏమంటున్నారు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది 50 వేల మందికి పైగా బ్రెయిన్ ట్యూమర్ వంటి ప్రమాదకరమైన వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇందులో పెద్దవారితో పాటు 20% పిల్లలు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చాలామందిలో మెదడు కణితి ఏర్పడడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అందులో ఒకటి పర్యావరణం లోపల వస్తున్న మార్పులు, విష పదార్థాలకు గురికావడం, జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. మెదడు కణితి ప్రారంభంలోనే కొన్ని లక్షణాలు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొంతమంది లోనైతే మెదడు కణితి ఏర్పడినప్పుడు చికిత్స పొందుతే ఉపశమనం పొందవచ్చు.. ఒకవేళ ఈ లక్షణాలు గుర్తించకపోయి.. మెదడు కణితి భారీ మొత్తంలో వ్యాపిస్తే చికిత్స చేయడం ఎంతో కష్టమవుతుంది. కొంతమందిలో ప్రారంభ దశలోని ఈ లక్షణాలు గుర్తించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్య ఉన్న వారిలో దృష్టి అస్పష్టంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది జ్ఞాన శక్తి పై ప్రభావం చూపి ఆకస్మిక నిర్ణయాలు, కొంతమందిలో స్పృహ కోల్పోవడం, మాట్లాడడంలో ఇబ్బంది, కొన్ని రకాల పదాలు గుర్తుపట్టకపోవడం, అలాగే తరచుగా గుర్తు ఉండకపోవడం, మనిషి బలహీనంగా అనిపించడం, ఎలాంటి పనులు చేసిన ఇబ్బందుల గురికావడం, మానసిక స్థితిలో అనేక మార్పులు వచ్చి వ్యక్తిత్వంలో భారీ మార్పులు ఏర్పడడం, ఎలాంటి స్థితిలోనైనా కోపం తెచ్చుకోవడం వంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి.
కొంతమందిలోనైతే మెదడు కణితి ఏర్పడితే చెవుల్లో నిరంతరం ఏదో ఒక శబ్దం కూడా ఏర్పడుతుందని.. మరికొంతమందిలో ప్రతిరోజు కోపంగానే ఉండే లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మీరు కూడా ఇలాంటి లక్షణాలతో బాధపడుతుంటే.. ముఖ్యంగా అతి కోపం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ప్రారంభ దశలోని రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకొని మెదడు కణితి నుంచి విముక్తి పొందడం చాలా మంచిదని వారంటున్నారు. పై ఎలాంటి లక్షణాలున్న తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









