)
Brussels sprouts benefits: బ్రస్సెల్స్ మొలకలు చూడటానికి క్యాబేజీ మాదిరి చిన్నగా కనిపిస్తుంది. కానీ ఇందులో పోషకాలు ఎక్కువే ఉంటాయి. ప్రధానంగా విటమిన్ సి, క్యాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక సమతుల ఆహారం అవుతుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరిచి మీ చర్మ ఆరోగ్యానికి కూడా మెరుగు చేస్తుంది. అంతేకాదు ఇది గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. రెగ్యులర్ గా మీ డైట్ లో బ్రస్సెల్స్ మొలకలు చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
జీర్ణ ఆరోగ్యం..
డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండే బ్రస్సెల్స్ మొలకలు తినడం వల్ల కడుపు ఆరోగ్యం బాగుంటుంది. ఇది దీర్ఘకాలిక మలబద్ధక సమస్యను నివారిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఆరోగ్యకరమైన పేగు బ్యాక్టీరియాకు తోడ్పడుతుంది. ప్రధానంగా ఖనిజాలు మన శరీరం గ్రహించడంలో సహాయపడుతుంది.
ఇమ్యూనిటీ బలం..
ఈ బ్రస్సెల్స్ మొలకలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. ప్రధానంగా ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల ఈ క్రూసీఫెరస్ జాతికి చెందిన కూరగాయ. సూపర్ ఫుడ్ అవుతుంది. తద్వారా మన ఇమ్యూనిటీ వ్యవస్థ మరింత బలపరిచి సీజనల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది.
ఆరోగ్యకరమైన ఎముకలు..
ఎముక ఆరోగ్యాన్ని కూడా బ్రస్సెల్స్ మొలకలు తినండి. ఇందులో కాల్షియం కలిగి ఉంటుంది. ఇది ఎముకకు ఎంతో ముఖ్యమైన ఖనిజం. బ్రస్సెల్స్ మొలకలలో ఉన్న క్యాల్షియం ఎముక సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతుంది.
గుండె ఆరోగ్యం..
బ్రస్సెల్స్ మొలకలు గుండె ప్రమాదాలను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ కైంప్ఫెరోల్ ఉంటుంది. ఇది రక్తనాళాలకు మెరుగు చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్రస్సెల్స్ మొలకలు తీసుకోవడం వల్ల గుండే సమస్యలు తగ్గుతాయి.
కాలేయ ఆరోగ్యం..
బ్రస్సెల్స్ మొలకలు కాలేయ ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సల్ఫర్ ఉంటుంది. ఇది మన శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపించేస్తుంది. దీంతో లివర్ కూడా డిటాక్సిఫై అయిపోతుంది. ఈ క్రూసిఫెరస్ జాతికి చెందిన కూరగాయతో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యను కూడా అధిరోహించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook