Ragi Java Telugu Facts: వేసవిలో కాలంలో చాలా మంది రాగి జావ అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు. రాగి పిండిలో శరీరానికి అవసరమైన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అలాగే ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు దీనిని అల్పాహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకల సమస్యలు దూరమవుతాయి. రాగి జావలో జింక్, థయామిన్ B1, రిబోఫ్లావిన్ B2, నియాసిన్ B3 పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు రాగి జావ తాగడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి కూడా లభిస్తుంది. దీంతో పాటు ఇందులో విటమిన్ E, ఫోలేట్, మాక్రోన్యూట్రియెంట్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించేందుకు సహాయపడతాయి. ఇవే కాకుండా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పోషకాలు:
రాగి జావాలో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియంతో పాటు ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో విటమిన్ బితో పాటు డైటరీ ఫైబర్ కూడా అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు జావా తాగడం వల్ల శరీరానికి తగిన మోతాదులో పోషకాలు పొందుతారు. ఇందులో లభించే కాల్షియం ఎముకలు, దంతాలను బలంగా ఉంచేందుకు సహాయపడుతుంది. దీంతో పాటు ఐరన్ రక్తహీనతను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
2. జీర్ణక్రియ సమస్యలకు చెక్:
రాగి జావాలో అధిక మొత్తంలో డైటరీ ఫైబర్ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో లభించే ఫైబర్ మలబద్ధకంతో జీర్ణ సంబంధిత సమస్యలను నివారించడానికి కూడా సహాయపడుతుంది.. దీంతో పాటు ప్రేగుల్లో ఆహారాన్ని సులభంగా కదలడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే పేగు కదలికలను క్రమబద్ధీకరణ కూడా జరుగుతుంది. ఇవే కాకుండా ఇతర పొట్ట సమస్యలను కూడా సులభంగా తగ్గిస్తుంది.
3. రక్తంలో చక్కెర స్థాయిలు:
ప్రతి రోజు రాగి జావా తాగడం వల్ల మధుమేహం ఉన్నవారికి చాలా మేలు జరుగుతుంది. ఈ జావాలో తక్కువ గ్లైసెమిక్ సూచిక (Glycemic Index) కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీని వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరగకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారికి లేదా ప్రీ డయాబెటిస్‌తో బాధపడేవారికి రాగి జావా ఒక ఆయుర్వేద రెమిడీగా భావించవచ్చు.
4. బరువు తగ్గడం:
రాగిలో ఉండే ఫైబర్ పొట్టను ఆరోగ్యంగా చేసేందుకు, ఆకలిని తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో లభించే తక్కువ కేలరీలు పొట్ట కొవ్వును తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు రాగి జావా తాగడం చాలా మంచిది. అంతేకాకుండా దీనిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. దీంతో పాటు తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.
5. గుండె ఆరోగ్యం:
రాగిలో ఉండే మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల తీవ్ర గుండె జబ్బులు ప్రమాదం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా రాగిలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









