Cabbage Health Benefits: తరచూ క్యాబేజీని డైట్ లో చేర్చుకుంటే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. క్యాబేజీని కూర లేదా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. క్యాబేజీ రెగ్యులర్‌గా కూర లేదా సలాడ్ రూపంలో కూడా తీసుకుంటారు. అయితే ప్రతిరోజు ఎండాకాలం క్యాబేజీ తీసుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు తెలుసుకుందాం ..
క్యాబేజీలో ఖనిజాలు పుష్కలం ఇందులో విటమిన్ కే కూడా ఉంటుంది. ఇది ఎముక ఆరోగ్యానికి ఎంతో మంచిది. క్యాబేజీలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. దీంతో సీజనల్ జబ్బులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. మన శరీరాన్ని కావలసిన మంచి పోషణ కూడా ఇది అందిస్తుంది
క్యాడ్బలు బరువు నిర్వహణలో ఉన్నవారు క్యాబేజీ తీసుకోవాలి ఇందులో ఫైబర్ ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. మన దగ్గర క్యాబేజీ తీసుకోవడం వల్ల ఫైబర్ కూడా అందుతుంది. తద్వారా బరువు పెరగకుండా ఉంటారు. ఇది ఆరోగ్యకరమైన స్నాక్ అని కూడా చెప్పొచ్చు.
క్యాబేజీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేస్తుంది. అంతేకాదు వాపు సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
రెగ్యులర్ గా క్యాబేజీ తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్తి తగ్గిపోతుంది. క్యాబేజీ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక మలబద్దకం సమస్యకు ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. క్యాబేజీ స్నాక్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
ఇదీ చదవండి: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 22న విడుదల..
ఆరోగ్యానికి మాత్రమే కాదు. అందమైన స్కిన్ కి కూడా క్యాబేజీని తీసుకోవాలి. ఇందులో విటమిన్ సి ఉంటుంది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీంతో మీ చర్మం నిత్య యవ్వనంగా కూడా కనిపిస్తుంది. క్యాబేజీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ కు వ్యతిరేకంగా పోరాడతాయి. తద్వారా మీ ముఖంపై వృద్ధాప్య ఛాయలు ఆలస్యంగా వస్తాయి .
క్యాబేజీలో కీళ్ల నొప్పులు తగ్గించే గుణం ఉంటుంది ఇది కీళ్లనొప్పులు ఆర్థరైటిస్ కి వ్యతిరేకంగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు రాడికల్ డామేజ్ కాకుండా కాపాడుతాయి, వయసు వచ్చే వృద్ధాప్య సమస్యలను ఆలస్యం చేస్తాయి ముఖంపై ఉండే నల్ల మచ్చలను కూడా రాను రాను తగ్గిపోతుంది. రక్తపోటుతో బాధపడుతున్న వారు క్యాబేజీ తీసుకోవాలి ఇది రక్తపోటు స్థాయిలను నిర్వహిస్తుంది పొటాషియం కలిగి ఉంటుంది.
ఇదీ చదవండి: ఇప్పుడు రీఛార్జీ చేసుకుంటే 2026 వరకు ఏప్రిల్ వరకు బంపర్ బెనిఫిట్స్.. బీఎస్ఎన్ఎల్ ప్లాన్ డీటెయిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









