Chia Seeds Health Benefits in Summer: నలుపు, తెలుపు రంగులో ఉండే ఈ చియా విత్తనాలు నానబెట్టి ప్రతిరోజు ఎండాకాలం తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండు. రాత్రి నానబెట్టిన చియా విత్తనాలు ఉదయం తేనే వేసుకొని తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మన డైలీ రొటీన్ లో ఎండాకాలం తప్పనిసరి చియా విత్తనాలతో కలిగే ఐదు ప్రయోజనాలు తెలుసుకుందాం.
చియా విత్తనాల్లో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అందుతుంది. ఇందులో తేనె వేసుకొని తీసుకుంటాం కాబట్టి ఇందులోని విటమిన్స్, మినరల్స్ కూడా మన శరీరానికి అందుతాయి. ఎండాకాలం తీసుకోవడం వల్ల మంచి సమతుల ఆహారం అవుతుంది.
చియా విత్తనాలు డైట్లో చేర్చుకుంటే మంచి జీర్ణ ఆరోగ్యానికి ప్రేరేపిస్తాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మన ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు తోడ్పడుతుంది. తేనె కూడా వేసుకొని తీసుకుంటాం. కాబట్టి ఆరోగ్యకరమైన పేగు కదలికలకు దీర్ఘకాలిక మలబద్దక సమస్య కూడా చెక్ పెడుతుంది. ఇందులో తేనెలో ప్రీబయోటిక్ గుణాలు ఉంటాయి. ఇది మంచి బ్యాక్టీరియా పెరగడానికి ప్రేరేపిస్తాయి.
ఇదీ చదవండి: Water melon: పుచ్చకాయను కట్ చేయకుండానే తీయ్యగా ఉంటుందని ఇలా గుర్తించండి..
చియా విత్తనాలు మన శక్తిని పెంచుతుంది. ఎండాకాలం వల్ల మన శరీర శక్తి కోల్పోతుంది. ఈ నీళ్లు ఉదయం తాగడం వల్ల మన శరీరాన్ని కావలసిన ప్రోటీన్, ఫైబర్ అందుతుంది. తక్షణ శక్తి అందిస్తుంది. ఈ విత్తనాలను రెగ్యులర్గా ఎండాకాలం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. ఇది కార్బోహైడ్రేట్స్ ని గ్రహించడంలో నెమ్మదిస్తుంది. చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడుతుంది. డయాబెటిస్ వారికి చియా విత్తనాలు ఎంతో మంచిది.
చియా విత్తనాలు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. దీంతో కార్డియో ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఈ రాశి అత్యంత ప్రత్యేకం..
బరువు నిర్వహణలో ఉన్న వాళ్ళు చియా విత్తనాలు తమ డైట్లో చేర్చుకోవాలి. ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి కార్బోహైడ్రేట్ ఇతర ఆహారాలు తీసుకోకుండా ఉంటారు. కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. ఇందులో క్యాలరీలు కూడా తక్కువ, చియా విత్తనాలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం బాగుంటుంది. చియా విత్తనాలు ఎండాకాలం మంచి శరీర ఆరోగ్యానికి హైడ్రేషన్ అందిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్- https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్- https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









