Chia VS Sesame Seeds: చియా విత్తనాలు లేదా నువ్వులు రెండిటిలో గుండె ఆరోగ్యానికి ఏది మేలు?

Chia VS Sesame Seeds Benefits: చియా విత్తనాలు, నువ్వులు రెండు ఆరోగ్య కరం. వీటిలో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే గుండె ఆరోగ్యానికి చియా విత్తనాలు లేదా నువ్వులు రెండిటిలో ఏది బెట్టర్? వాటి లాభాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Apr 29, 2025, 08:55 PM IST
Chia VS Sesame Seeds: చియా విత్తనాలు లేదా నువ్వులు రెండిటిలో గుండె ఆరోగ్యానికి ఏది మేలు?

Chia VS Sesame Seeds Benefits: ఇక చియా విత్తనాలో ఫైబర్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరానికి అవసరమయ్యే కొవ్వులు అయినా మెగ్నీషియం, క్యాల్షియం ఉంటాయి. ఇక ఈ నువ్వులలో కూడా మంచి ఖనిజాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అయినా సెసమైన్‌ కూడా ఉంటుంది. అయితే ఐరన్, జింక్ కూడా పుష్కలంగా కలిగి ఉంటాయి. 

Add Zee News as a Preferred Source

చియా విత్తనాలు డైట్లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఒమేగా 3S గుణాలు కలిగి ఉంటుంది. ఇది మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేస్తుంది. తద్వార గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుండె సమస్యలు మన దరిదాపుల్లోకి కూడా రావు ఒమేగా 6 కొవ్వులు కూడా కలిగి ఉంటాయి. ఇది డైటరీ ఫైబర్ కలిగి ఉండటం వల్ల కార్డియో ఆరోగ్యానికి కూడా మంచి లాభదాయకం.

నువ్వుల డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎముక ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో క్యాల్షియం, జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇక చియా విత్తనాల్లో కూడా కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ఈ రెండు గింజల్లో ఎముక ఆరోగ్యానికి తోడ్పడే గుణం కలిగి ఉంటుంది. దీంతో ఎముకలు దృఢంగా, ఆరోగ్యకరంగా ఉంటాయి.

బరువు నిర్వహణలో ఉన్నవారు చియా విత్తనాలు డైట్ లో చేర్చుకోవచ్చు. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. నయం చేసే గుణాలు కూడా ఉంటాయి. ప్రధానంగా ఇందులో ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలుగుతుంది. అంతేకాదు కడుపులో మంచి బయాక్టిరియా పెరగడానికి ప్రేరేపిస్తుంది. ఇక నువ్వుల గింజల్లో కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది కూడా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.

నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో సెసమైన్‌, సెసమోల్‌ ఉంటాయి. ఇది సెల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అంతేకాదు ఆరోగ్యకరమైన కాలేయ పనితీరు కూడా మేలు చేస్తుంది. చియా విత్తనాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది నువ్వులతో పోలిస్తే శక్తివంతమైన లిగనన్స్‌ కూడా కలిగి ఉంటుంది.

READ ALSO:  విద్యార్థులకు బిగ్‌ అలెర్ట్‌.. రేపు పదో తరగతి ఫలితాలు విడుదల, ఈసారి గ్రేడింగ్‌తోపాటు మార్కులు..

READ ALSO: మారిన తత్కాల్ టికెట్ నియమాలు.. . భారతీయ రైల్వేలు ముఖ్యమైన ప్రకటన..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

...Read More

Trending News