Cinnamon Tea Benefits: వేసవిలో ఖాళీ కడుపుతో ఈ టీ తాగితే బంపర్‌ బెనిఫిట్స్‌ మీ సొంతం!

Cinnamon Tea Benefits Telugu: ప్రతి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క టీ తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తాయి. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 2, 2025, 01:31 PM IST
Cinnamon Tea Benefits: వేసవిలో ఖాళీ కడుపుతో ఈ టీ తాగితే బంపర్‌ బెనిఫిట్స్‌ మీ సొంతం!

Cinnamon Tea Benefits Telugu: చాలా మంది ఉదయాన్నే పాలతో తయారు చేసిన టీలు తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల అనేక రకాల దూష్ప్రభావాలు కలుగుతాయి. ఇందులో ఉండే చక్కెర పరిమాణాలు వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఈ పాల టీకి బదులుగా రోజు ఉదయాన్నే దాల్చిన చెక్కతో చేసిన టీ తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో లభించే మాంగనీస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌ వంటి ఖనిజాలు శరీరానికి అద్భుతమైన శక్తిని అందిస్తాయి. అలాగే అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఇవి వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. ఇవే కాకుండా శరీరానికి ఇంకా బోలెడు లాభాలు కలుగుతాయి. 

Add Zee News as a Preferred Source

దాల్చిన చెక్క టీ తాగడం వల్ల కలిగే లాభాలు:
యాంటీఆక్సిడెంట్లకు మూలం: 
దాల్చిన చెక్కలో పాలీఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి..కణాలను దెబ్బతినకుండా కాపాడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.

మంటను తగ్గిస్తుంది: 
దాల్చిన చెక్కలో ఎక్కువ మోతాదులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు లభిస్తాయి. ఇవి శరీరంలో దీర్ఘకాలిక మంటను తగ్గించడానికి క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల గుండె జబ్బులతో పాటు ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. 

గుండె ఆరోగ్యం కోసం:
కొన్ని అధ్యయనాల తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి రోజు దాల్చిన చెక్క టీ తాగితే గుండె సమస్యలు కూడా రావట.. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలు తగ్గి..ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా తీవ్ర గుండె సమస్యలు కూడా తొలగిపోతాయి. 

రక్తంలో చక్కెర సమస్యలకు చెక్‌: 
దాల్చిన చెక్క టీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది: 
కొన్ని పరిశోధనలు వెల్లడించిన వివరాల ప్రకారం, దాల్చిన చెక్క టీ ఉదయాన్నే తాగితే.. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడానికి సహాయపడుతుంది. ఇది పెరుగుతున్న క్యాన్సర్‌ కణాలను తగ్గించేందుకు కూడా ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News