Coconut Oil VS Castor Oil: కొబ్బరి నూనె లేదా ఆముదం జుట్టు ఏది మంచిది సీక్రెట్‌ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Coconut Oil VS Castor Oil for Healthy Hair Growth: మన జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. దీనికి షాంపూ, నూనె, కండీషనర్ వంటివి ఉపయోగిస్తాము. అయితే జుట్టు పెరుగుదలకు ఎన్నో ఏళ్లుగా కొబ్బరి నూనె.. ఆముదం నూనె వినియోగిస్తున్నారు. అయితే ఈ రెండిటిలో ఏది ఉపయోగిస్తే మన జుట్టు ఆరోగ్యంగా హెయిర్ ఫాల్ కాకుండా పెరుగుతుంది తెలుసా?

Written by - Renuka Godugu | Last Updated : Mar 8, 2025, 08:53 AM IST
Coconut Oil VS Castor Oil: కొబ్బరి నూనె లేదా ఆముదం జుట్టు ఏది మంచిది సీక్రెట్‌ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Coconut Oil VS Castor Oil for Healthy Hair Growth: కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. అందుకే మన బామ్మల కాలం నాటి నుంచి కూడా కొబ్బరి నూనెను మన హెయిర్ కేర్ రొటీన్‌లో ఉపయోగిస్తారు. కొబ్బరి నూనెతోపాటు ఆముదం నూనె, ఆలీవ్‌ ఆయిల్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే జుట్టు పెరుగుదలకు కొబ్బరి నూనె లేదా ఆముదం నూనె రెండిటిలో ఏది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది?

Add Zee News as a Preferred Source

ఆముదం నూనెను కూడా ఎన్నో ఏళ్లుగా హెయిర్ కేర్ రొటీన్‌లో ఉపయోగిస్తారు. ఇది జుట్టుకు రాయడం వల్ల చుండ్రు తొలగిపోతుంది. ఆరోగ్యంగా పెరుగుతుంది అనే నమ్మకం ఉంది. అంతేకాదు ఆముదం నూనెలో రైసీనోలోక్‌ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టుకు హైడ్రేషన్‌ అందిస్తుంది. అంతే కాదు హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యంగా పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇక కొబ్బరి నూనెలో కూడా మంచి పోషకాలు ఉన్నాయి. ఇది జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తాయి. దీంతో కుదుళ్లు ఆరోగ్యంగా జుట్టు రాలకుండా పెరుగుతుంది.

ఆముదం నూనె జుట్టుకు మాయిశ్చర్ అందిస్తుంది. ఇందులో హైడ్రేషన్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇక కొబ్బరి నూనె కూడా జుట్టుకు మంచి లోతైన పోషణ అందిస్తుంది. ఇందులో ప్రోటీన్ ఉంటుంది. అంతేకాకుండా కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో చుండ్రు సమస్య కూడా రాదు.ఆముదంలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది డ్యాండ్రఫ్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. దీంతో కుదుళ్లు ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉంటుంది. ఇందులో ఇన్‌ఫ్లమేషన్‌ గుణాలు ఉంటాయి. అయితే కొబ్బరి నూనెలో కూడా లారీక్ యాసిడ్ ఉంటుంది. ఇది కూడా యాంటీ మైక్రోబియల్‌ గుణాలు కలిగి ఉండటం వల్ల మీ జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. మంచి పోషణ అందించి హెయిర్ ఫాలికల్స్ బలంగా పెరుగుతాయి.

ఇదీ చదవండి:  నువ్వు కూడా సీఎం రేవంత్‌ పేరు మర్చిపోయావా తల్లి? ఇండియా టుడే యాంకరమ్మ ఏ పేరుతో పిలిచిందో చూడండి.. 

అంతే కాదు ఆముదం నూనె జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుస్తుంది. డ్యాండ్రఫ్‌ సమస్య రాదు. జుట్టు మందంగా, పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. ఆముదం నూనె జుట్టుకు సహజ సిద్ధమైన బలాన్ని అందిస్తుంది. అయితే ఆముదం నూనె త్వరగా జుట్టు పొడిబారేవారికి సెట్ అవుతుంది. జుట్టు సన్నగా మారిపోయిన వారికి ఇది మాయిశ్చర్‌ గుణాలు అందించి బలంగా మారుస్తుంది. ఇక కొబ్బరి నూనె ఆయిలీ హెయిర్ టైప్ వారికి హైడ్రేషన్ అందిస్తుంది. మీకు లైట్ గా హైడ్రేషన్ కావాలంటే కొబ్బరి నూనెను ఉపయోగించండి.

 ఈ కొబ్బరినూనె జుట్టుకు లోతైన కండిషన్ అందిస్తుంది. కుదుళ్లకు మంచి చికిత్స చేయడంలో మేలు చేస్తుంది.. ఆముదం నూనె వాసన వస్తే కూడా ఏదైనా ఎసెన్షియల్స్ ఆయిల్స్ అందులో కలిపి పెట్టుకోవచ్చు. ఇక కొబ్బరి నూనె ఉపయోగించేవారు వారంలో కనీసం మూడుసార్లు అయినా ఉపయోగించాలి. తలస్నానం చేసే ముందు కొబ్బరి నూనె వేడి చేసి తలందటకి పట్టించి ఓ గంట తర్వాత తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

ఇదీ చదవండి: PM Kisan: పీఎం కిసాన్‌ 20వ విడుత నిధుల మంజూరు తేదీ వచ్చిందోచ్‌.. ఎప్పుడో తెలుసుకోండి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News