Facial With Coffee: కాఫీ తాగే అలవాటు చాలామందిలో ఉంటుంది. దీంతో తలనొప్పి సమస్య కూడా తగ్గిపోతుంది. అయితే, కాఫీతో ఫేషియల్ చేసుకోవచ్చని తెలుసా?
కాఫీ ఫేషియల్ ప్రయోజనాలు..
కాఫీలో ఎక్సఫోలియేటింగ్ గుణాలు ఉంటాయి. ఇది మన చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగిస్తుంది. దీంతో మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. చర్మానికి పునరుజ్జీవనం అందుతుంది. కంటి చుట్టూ ఉండే వాపును కూడా తగ్గిస్తుంది. కాఫీలో యాంట బ్యాక్టిరియల్ గుణాలు ఉంటాయి. దీంతో ఫేషియల్ చేసుకుంటే ముఖ రంధ్రలు కూడా మూసుకుపోతాయి.
కాఫీతో ఫేషియల్ చేసుకునే విధానం..
ముందుగా ముఖాన్ని కడగాలి. తద్వారా ముఖంపై ఉండే మలినాలు తొలగిపోతాయి. ఆ తర్వాత టవల్‌తో ముఖాన్ని తుడవాలి. ఇప్పుడు కాఫీ స్క్రబ్ తయారు చేయడానికి ముందుగా ఒక చెంచా కాఫీ పొడ, చెంచా తేనె లేదా పెరుగు వేసి కలపాలి. దీన్ని మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ముఖంపై మృదువుగా మసాజ్ చేయాలి. గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి.
కాఫీ మాస్క్..
కాఫీ పొడి, రోజ వాటర్ లేదా పాలు, అరచెంచా పసుపు కలుపుకోవచ్చు. దీన్ని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ముఖమంతా అప్లై చేసుకోవాలి. ఓ అరగంట తర్వాత ఫేస్‌వాష్ చేయాలి.
కాఫీ టోనర్..
మరగబెట్టిన కాఫీ, రోజ్ వాటర్ కలిపి కాఫీ టోనర్ కూడా తయారు చేసుకోవచ్చు. ఒక స్ప్రే బాటిల్‌లో వేసి బాగా షేక్ చేయాలి. ఇప్పుడు అవసరమైనప్పుడు ముఖంపై వాడాలి. ఓ కాటన్‌తో తుడుచుకోవచ్చు. మన చర్మానికి హైడేషన్ అందాలంటే ఆ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.
ఇదీ చదవండి: Morning Vs Evening Walk: ఉదయం లేదా సాయంత్రం గుండె ఆరోగ్యానికి ఎప్పుడు వాకింగ్ చేయాలి?
కాఫీతో ఫేషియల్ వారానికి రెండుసార్లు ప్రయత్నించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. దీంతో మచ్చలేని ఆరోగ్యకరమైన స్కిన్ టోన్ పొందుతారు. కాఫీ పొడి ఉంటే పార్లర్‌కు వెళ్లి వేల ఖర్చు కూడా చేయాల్సిన పనిలేదు. కాఫీ పొడి చక్కెర కలిపి మంచి స్క్రబ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది చర్మం పై ఉండే డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగిస్తుంది. కాఫీ పొడి, బంగాళదుంప రసం వేసి ముఖానికి మాస్క్ వేయాలి. ఇలా చేయడం వల్ల ఈవెన్ స్కిన్ టోన్ పొందుతారు. ముఖం మచ్చ లేకుండా కాంతివంతంగా కనిపిస్తుంది.
కాఫీ, బియ్యం పిండి, బంగాళ దుంప రసం కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవచ్చు. కాఫీ పొడి రోజ్ వాటర్ వేసుకుని ప్యాక్ వేసుకుంటే ముఖానికి తక్షణ తాజాదనం వస్తుంది. ముఖంపై ఉండే అదనపు నూనెను ఇది గ్రహించేస్తుంది. కాఫీ పొడితో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేకుండా ముఖానికి మంచి కాంతిని పెంచుతుంది.
ఇదీ చదవండి: Raw Banana: పచ్చి అరటికాయ తింటే ఈ రోగాలు ఫసక్.. ఆ జబ్బులు జన్మలో రావు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









