Coffee Powder For Glowing Face: రూ.2 కాఫీ పొడితో డార్క్ సర్కిల్స్, డెడ్ స్కిన్‌కి చెక్..
Coffee Powder For Glowing Face: కాఫీ ఫేస్ మాస్క్‌ను ముఖానికి వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు ముఖాన్ని అందంగా చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా ముఖానికి రంగును అందిస్తాయి.
Coffee Powder For Glowing Face: కాఫీ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేవారు రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు తాగుతూ ఉంటారు. కాఫీ పౌడర్‌లో ఉండే కొన్ని మూలకాలు శరీరాన్ని యాక్టివ్‌గా చేసేందుకు సహాయపడతాయి. ఈ పొడిని చాలా మంది జుట్టుతో పాటు చర్మానికి కూడా వినియోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా దీనిని చర్మ సమస్యలతో బాధపడేవారు వినియోగించడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందవచ్చని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ కాఫీ పౌడర్‌ను చర్మానికి వాడడం వల్ల డెడ్ స్కిన్ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇరత ప్రయోజనాలు కూడా కలుగుతాయి..అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కాఫీ ఫేస్ మాస్క్:
ముఖం నుంచి డెడ్ స్కిన్ తొలగించడానికి కాఫీ పౌడర్‌తో తయారు చేసిన ఫేస్ మాస్క్ ప్రభావంతంగా సహాయపడుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. కాఫీలో పెరుగు లేదా తేనె కలిపి మిశ్రమంలా తయారు చేసుకుని మూఖానికి పట్టించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ ఫేస్ మాస్క్‌ను వినియోగించేవారు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకున్న మురికిని, దుమ్మును సులభంగా తొలగిపోతుంది. అంతేకాకుండా ముఖం మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
చర్మానికి చాలా మేలు చేస్తుంది:
కాఫీ పౌడర్ అనేది సహజమైన ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్..కాబట్టి దీనిని క్రమం తప్పకుండా ఫేస్‌కి వినియోగించడం వల్ల ముఖం అందంగా తయారవుతుంది. దీనిని వినియోగించాలనుకునేవారు ఒక గిన్నెలో కాఫీ తీసుకుని అందులో కొద్దిగా కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుని మూఖానికి పట్టించి మసాజ్ చేయాల్సి ఉంటుంది.
డార్క్ సర్కిల్:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యల ఎక్కువగా మహిళల్లో వస్తోంది. ఈ సమస్యను తొలగించేందుకు కూడా కాఫీ ప్రభావంతంగా సహాయపడుతుంది. డార్క్ సర్కిల్ సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు కాఫీ పౌడర్‌ని చల్లటి నీటిలో కలిపి..మిశ్రమంలా తయారు చేసుకుని కళ్ల కింద పట్టించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook