)
Health benefits Of Coriander: రెగ్యులర్‌గా ధనియాలు తీసుకోవటం వల్ల జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ధనియాలు, కొత్తిమీర రెండు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. ధనియాలు తీసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం..
ధనియాలలో మెడిసినల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కడుపులో గ్యాస్ ఉండే మంటని తగ్గిస్తుంది తక్షణ రిలీఫ్ గా కూడా పేర్కొంటారు. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రాత్రంతా నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల కడుపునొప్పి సమస్యలు కూడా తగ్గిపోతాయి. లేకపోతే దీన్ని మరిగించి కూడా తీసుకోవచ్చు.
శరీరంలో వేడి సమస్యను కూడా ఈ ధనియాలు తగ్గిస్తాయి. పితదోషను కూడా నివారిస్తుంది కూడా. ధనియాలు కఫ దోషం తగ్గించే గుణం కలిగి ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ గా డైట్లో చేర్చుకోవాలి . ధనియాల నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల మహిళలకు ఎంతో మంచిది. ఇవి జీర్ణ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది.
ధనియాలు నానబెట్టిన నీటిని తీసుకోవటం వల్ల రక్తంలో చక్కర స్థాయిలు కూడా సమతులమవుతాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను బూస్టింగ్ ఇస్తుంది. రెగ్యులర్‌గా ధనియాలు తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీసెప్టిక్ లక్షణాలు ముఖంపై ఉండే గీతాలు, యాక్నే కూడా తగ్గిస్తుంది. అదనంగా ఇది తలనొప్పి, స్ట్రెస్ సమస్యలను కూడా తగ్గించే గుణం కలిగి ఉంటుంది. ధనియాలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు.
ధనియాలు నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాంగా ఉంటుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. మహిళల ముఖ్యంగా వారి డైట్లో ధనియాలు చేర్చుకోవడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్తి సమస్య కూడా తగ్గిపోతుంది. వెయిట్‌లాస్ జర్నీలో ఉండేవారు, రెగ్యులర్‌గా ఈ ధనియాలు తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు. దీంతోపాటు జీలకర్ర కలిపి తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు సులభంగా తగ్గిపోతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook