)
Cracked Heels Treatment: పొడి వాతావరణం లేదా పాదాల్లో తేమ లేకపోవడం వంటి కారణాల వల్ల శీతాకాలంలో మడమలు పగలడం సర్వసాధారణంగా మారుతుంది. అయితే ఈ సమస్యను సకాలంలో పరిష్కరించుకోకపోతే, చీము పట్టడం, నొప్పి, రక్తస్రావం వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీయవచ్చు. వీటి నివారణకు కొన్ని ఇంటి చిట్కాలను తెలుసుకుందాం.
మడమలు పగలడానికి ప్రధాన కారణాలు
మడమల పగుళ్లకు దోహదపడే అనేక అంశాలు ఉన్నాయి. పొడి వాతావరణం, తేమ లోపం: శీతాకాలంలో గాలిలో తేమ తగ్గిపోవడం వల్ల చర్మం, ముఖ్యంగా పాదాల చర్మం త్వరగా పొడిబారుతుంది. పాదాల్లో నూనె గ్రంథులు తక్కువగా ఉండటం వల్ల సహజంగానే అవి త్వరగా ఎండిపోయి పగుళ్లు రావొచ్చు.
మడమలపై ఒత్తిడి: అధిక బరువు లేదా ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల పాదాలపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల పాదాల కింద ఉండే కొవ్వు ప్యాడ్లు సాగి, చర్మం పగుళ్లు రావొచ్చు.
వయసు రీత్యా: వయసు పెరిగిన కొద్దీ చర్మం తన కంట్రోల్ కోల్పోతుంది. చర్మంలోని సహజ నూనెల ఉత్పత్తి తగ్గడం వల్ల మడమలు పొడిబారి, పగుళ్లకు కారణం కావొచ్చు
అనారోగ్య సమస్యలు: సోరియాసిస్, తామర వంటి చర్మ సమస్యలు, అలాగే డయాబెటిస్, థైరాయిడ్ వంటి ఆరోగ్య పరిస్థితులు కూడా మడమల పగుళ్లకు కారణమవుతాయి.
తగని పాదరక్షలు: శీతాకాలంలో క్లోజ్డ్ షూస్ లేదా మంచి నాణ్యత గల పాదరక్షలు ధరించకపోవడం వల్ల చర్మం నిరంతరం చల్లని, పొడి గాలికి గురై ఎండిపోతుంది.
తక్కువ నీరు త్రాగడం: చలికాలంలో తగినంత నీరు తాగకపోవడం వల్ల శరీరంలో తేమ లోపించి, చర్మం పొడిగా మారుతుంది.
పగిలిన మడమలకు సింపుల్ ఇంటి నివారణలు..
కాలి మడమల పగుళ్ల నుంచి తీవ్రమైన చీము, నొప్పి లేదా రక్తస్రావం ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. సాధారణ పగుళ్లకు ఇంట్లో ఈ చికిత్సలను పాటించవచ్చు.
పాదాలు నానబెట్టడం: ప్రతిరోజూ 15 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో పాదాలను నానబెట్టండి. దీని తర్వాత, మృత చర్మ కణాలను తొలగించడానికి ప్యూమిస్ స్టోన్ (Pumice Stone) లేదా స్క్రబ్బర్‌తో మడమలను సున్నితంగా రుద్దండి.
నూనె/క్రీమ్ వాడకం: స్నానం చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె, బాదం నూనె లేదా ఆలివ్ నూనె వంటి మాయిశ్చరైజర్‌ను మడమలకు రాయండి. కాలి మడమల కింద చర్మం పగుళ్లను అరికడుతుంది.
అరటిపండు: బాగా పండిన అరటికాయను పేస్ట్ చేసి పగిలిన కాలి మడమలకు రాసి ఆ తర్వాత 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.
కలబంద, నిమ్మరసం: కలబందలోని జెల్‌ను నిమ్మరసంతో కలిపి కాలి మడమలకు రాత్రంతా రాసి ఉంచండి. దీంతో పాటు సాక్స్ ధరిస్తే మంచి ఫలితం లభిస్తుంది.
రోజ్ వాటర్, గ్లిజరిన్: ఒక స్పూన్ రోజ్ వాటర్, టేబుల్ స్పూన్ గ్లిజరిన్ కలిపిన మిశ్రమాన్ని కాలి మడమలకు అప్లై చేయాలి. ఇది త్వరితగతిన ఫలితాన్ని ఇస్తుంది.
కాళ్ల మడమలు తగ్గడానికి ముఖ్య సూచనలు:
తగినంత ద్రవాలు, ముఖ్యంగా నీరు పుష్కలంగా త్రాగండి.
రాత్రిపూట మాయిశ్చరైజర్ రాసి సాక్స్ ధరించడం వల్ల మడమలు మృదువుగా ఉంటాయి.
గమనిక: పైన పేర్కొన్న చిట్కాలు కేవలం సాధారణ నివారణలు మాత్రమే. ఏ చికిత్సనైనా పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. వీటిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook