Cucumber Salad Benefits: వేసవిలో రోజు దోసకాయ తినడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ కెతో పాటు విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతో పాటు వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి వివిధ రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి. ముఖ్యంగా ఇందులో లభించే మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడానికి, గుండె సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే దోసకాయలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి దీనిని తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. దీంతో పాటు మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా దూరమవుతాయి. ఇవే కాకుండా ఇంకా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ తినడం వల్ల కలిగే లాభాలు కలుగుతాయి:
1.శరీరాన్ని హైడ్రేటెడ్:
దోసకాయలో 95 శాతం కంటే ఎక్కువగా నీరు లభిస్తుంది. ఇది వేసవి కాలంలో డీహైడ్రేషన్ ప్రమాదం నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా దోసకాయ సలాడ్ తినడం వల్ల శరీరంలో నీటి స్థాయిలు కూడా పెరుగుతాయి. దీని కారణంగా చర్మాన్ని తేమగా తయారవుతుంది. అంతేకాకుండా శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
2.పోషకాలు:
దోసకాయ సలాడ్ తినడం వల్ల శరీరానికి తగిన మోతాదులో విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియంతో పాటు మాంగనీస్ వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇందులో లభించే విటమిన్ కె రక్తం గడ్డకట్టడానికి, ఎముకల ఆరోగ్యానికి అవసరమవుతుంది. అంతేకాకుండా విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో లభించే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. దీని కారణంగా జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయి.
3. బరువు తగ్గడానికి:
దోసకాయలో కేలరీలు తక్కువగా..ఫైబర్ ఎక్కువగా మోతాదులో లభిస్తుంది. దీని కారణంగా పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ఇందులో లభించే తక్కువ కేలరీలు శరీర బరువు తగ్గడానికి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ సలాడ్ ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సలాడ్ తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది.
4. జీర్ణక్రియ సమస్యలకు చెక్:
దోసకాయలో ఫైబర్, నీరు అధికంగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో లభించే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడానికి, ప్రేగు కదలికలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. తరచుగా దోసకాయ సలాడ్ తినడం వల్ల ఆహారం మరింత సులభతరంగా జీర్ణమువుతుంది.
5. చర్మ ఆరోగ్యం:
దోసకాయలో యాంటీఆక్సిడెంట్లతో పాటు సిలికా ఉంటాయి. ఇందులో లభించే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మంపై వృద్ధాప్య సంకేతాలను ఎంతో సులభంగా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఇందులో లభించే ఇతర గుణాలు కణజాలాన్ని బలోపేతం చేయడానికి మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సలాడ్ తినడం వల్ల శరీరం మొత్తం చల్లదనంగా మారుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









