Cucumber Salad For Weight Loss And Gastric Problem: దోసకాయ సలాడ్ తినడం వల్ల శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. ఇందులో విటమిన్ కె, విటమిన్ సి ఎక్కువ మోతాదులో లభిస్తాయి. అలాగే ఇందులో విటమిన్ ఎ, బిలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ ఖనిజాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు అల్పాహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దోసకాయలో పీచుపదార్థాలు, ఫ్లేవనాయిడ్లు, ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇందులో 96 శాతం కూడా నీరు లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఈ సలాడ్ తినడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా మారుతుంది.
దోసకాయ సలాడ్ తినడం వల్ల కలిగే లాభాలు:
నీటి శాతం పెరుగుతుంది:
దోసకాయ సలాడ్‌లో ఎక్కువ శాతం నీరు లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు దీనిని తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు వేసవిలో ఈ సలాడ్ తింటే చర్మం నుంచి అనేక రకాల అనారోగ్య సమస్యల వరకు విముక్తి కలుగుతుంది.
సమృద్ధిగా పోషకాలు :
దోసకాయలో విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. తరచుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా దోసకాయ సలాడ్ తినడం ఎంతో మంచిది.
తక్కువ కేలరీలు:
దోసకాయలో కేలరీలు చాలా తక్కువగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు దీనిని తినడం వల్ల బరువు కూడా సులభంగా తగ్గుతారు. అంతేకాకుండా తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా కూడా భావించవచ్చు.
చర్మానికి మంచిది:
దోసకాయలో ఉండే నీరు, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని తేమగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా దోసకాయను అల్పాహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది.
జీర్ణక్రియ సమస్యలు:
ఈ సలాడ్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.. కాబట్టి ఇది తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా గ్యాస్ట్రిక్ సమస్య నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
యాంటీఆక్సిడెంట్లు:
దోసకాయలో ఫ్లేవనాయిడ్స్, టానిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాలను దెబ్బతినకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన కూడా సహాయపడుతుంది.
హృదయ ఆరోగ్యానికి..:
దోసకాయలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గుతుంది. అలాగే దీర్ఘకాలిక గుండె సమస్యలు కూడా తగ్గుతాయి.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









