)
Head Massage Trick: ఆరోగ్యకరమైన జుట్టు కావాలంటే ప్రతిరోజు మీ చేతి వేళ్లతో జుట్టు కుదుళ్ల నుంచి మసాజ్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తప్రసరణను మెరుగు చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ ను అదుపులో ఉంచుతుంది. అంతేకాదు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కూడా కాపాడుతుంది. ఇలా వేళ్లతో మంచి మసాజ్ ఇవ్వటం వల్ల సమస్యలు కూడా తగ్గిపోయి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది
వేళ్లతో జుట్టుకి మంచి మసాజ్ ఇవ్వటం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ కుదుళ్లకు హెయిర్ ఫాలికల్స్ కి మంచి జుట్టు పెరుగుదలకు ఇది ప్రేరేపిస్తుంది. దీంతో ఆరోగ్యంగా బలంగా కూడా మీ జుట్టు పెరుగుతుంది. ప్రతిరోజు మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగు కావడమే కాకుండా రక్తనాళాలు కూడా టిష్యూస్ కూడా ఓపెన్ అవుతాయి. రక్త ప్రసరణ మరింత మెరుగయ్యి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది
తలస్నానం చేసేటప్పుడు ముందు కూడా హెడ్ మసాజ్ చేసుకోవచ్చు. దీనికి మీ ఫింగర్ టిప్స్ ఉపయోగించి మెల్లిగా ప్రెస్ చేస్తూ స్కాల్ప్ మసాజ్ చేయాలి. సర్క్యూలర్ షేపులో చేతి వేళ్ళతో మసాజ్ చేస్తూ ఉండాలి. ఓ 20 నిమిషాలు ప్రతిరోజు ఇలా చేయాలి లేకపోతే వారంలో కనీసం రెండుసార్లు అయినా చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి
లేకపోతే ఏదైనా ఆయిల్స్ తో కూడా మసాజ్ ఇవ్వొచ్చు. కొన్ని రకాల సిరమ్స్ ఉపయోగించి మసాజ్ చేయడం వల్ల కూడా తలపై ఉండే అదనపు నూనె తగ్గుతుంది. మీరు దీనికి ఎలక్ట్రిక్ హ్యాండ్ హెల్డ్ పరికరాలను ఉపయోగించడం కూడా మంచిదే. దీంతో కూడా సులభంగా మసాజ్ చేయవచ్చు. కొన్ని రకాల దువ్వెనలతో కూడా మసాజ్ చేసేటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల హెడ్ మసాజ్ చేయడం వల్ల త్వరగా జుట్టు పెరుగుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.