Daily VS Weekly Hair wash Which Is better: జుట్టు కుదుళ్లు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. అందుకే షాంపూ ఉపయోగించి తల స్నానం చేస్తాం. అయితే వారానికి ఒకసారి జుట్టు శుభ్రంగా షాంపూ ఉపయోగించి తలస్నానం చేయడం వల్ల ఆరోగ్యంగానే జుట్టు పెరుగుతుంది. అయితే ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. వారి చర్మ రకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమందికి నూనె అదనంగా జుట్టుపై పేరుకుంటుంది. ఇలాంటి వారికి చెమట కూడా పడుతుంది. అలాంటప్పుడు వారంలో రెండు మూడు సార్లు తలస్నానం చేయడం బెట్టర్.
రోజు తలస్నానం చేస్తే ఏం జరుగుతుంది?
చాలా మంది తలస్నానం ప్రతిరోజూ చేస్తేనే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది అని.. యాక్టివ్ లైఫ్ స్టైల్ లో ఇది తప్పనిసరి అని అనుకుంటారు. అయితే మారుతున్న వాతావరణం, చర్మ రకాన్ని బట్టి కూడా పరిగణలోకి తీసుకోవాలి. కొంతమందికి జుట్టులో అధికంగా నూనె పేరుకుంటుంది. తద్వారా డస్ట్ కూడా వస్తుంది. చెమట ఎక్కువ వీళ్లు ప్రతి రోజు తల స్నానం చేయడం బెట్టర్. లేకపోతే జుట్టు నుంచి దుర్వాసన కూడా వస్తుంది.
ప్రతిరోజు తలస్నానం చేయడం వల్ల జుట్టు కుదుళ్లలో సెబం ఉత్పత్తిని నిలిపివేస్తుంది. అంతేకాదు అదనంగా ఉన్న నూనెను కూడా గ్రహించేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఇలా చేయడం వల్ల కుదుళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి. ప్రధానంగా చుండ్రు, దురదలు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు తలస్నానం చేయటం వల్ల మన జుట్టు కూడా ఆరోగ్యంగా తాజాగా అనిపిస్తుంది. వర్క్ కోసం బయటకు వెళ్లే వాళ్ళు తలస్నానం ప్రతిరోజు చేయడం బెట్టర్. కొంతమంది ప్రతిరోజు మోసే లేదా స్ప్రే, జెల్స్ వంటివి జుట్టు పై ఉపయోగించాల్సి వస్తుంది. వారు ప్రతి రోజు తలస్నానం చేయాల్సిందే.
ఇదీ చదవండి: రంగుల హోలీ ఆడుతున్నారా? ఇది లేకుంటే నష్టపోతారు జాగ్రత్త..
ప్రతిరోజు తలస్నానం చేయటం వల్ల కొంతమందికి చర్మ రకాన్నిబట్టి త్వరగా పొడిబారుతుంది. పొట్టు రాలిపోయి చర్మ సమస్యలు, దురదలు వచ్చే ప్రమాదం ఉంది. కెమికల్స్ వల్ల ఇతర స్కిన్ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. తద్వారా మీ జుట్టు బలహీనంగా మారిపోతుంది. ఇక రోజు వేడి నీళ్లతో తలస్నానం చేసే వారికి మరింత ప్రమాదం స్ప్లిట్ ఎండ్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇక కర్లీ హెయిర్ ఉన్నవాళ్లు వారంలో ఒకసారి తల స్నానం చేస్తే సరిపోతుంది. ఇది మన జుట్టు కుదుళ్లకు సహజమైన మంచి పోషణ అందిస్తుంది. వారానికి ఒకసారి తలస్నానం చేయడం వల్ల జుట్టుకు హైడ్రేషన్ కూడా అందిస్తుంది. ఆరోగ్యంగా జుట్టు పెరుగుతుంది. ఇందులో ప్యారాబీన్స్ కూడా ఉండటం వల్ల జుట్టు త్వరగా డ్యామేజ్ అయిపోతుంది. ఇక వారానికి ఒకసారి తలస్నానం చేయడం వల్ల తలకు జుట్టు ఆరోగ్యంగా బలంగా మారుతుంది. డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అయితే నూనె అధికంగా ఉండే వ్యక్తులు వారానికి ఒకసారి తల స్నానం చేయడం వల్ల స్కాల్ప్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు డెడ్ స్కిన్ సెల్ పెరిగిపోతాయి. డాండ్రఫ్ పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ జుట్టు రకాన్ని మారుతున్న వాతావరణ అనుసరించి తలస్నానం చేయడం అలవాటు చేసుకోవాలి.
ఇదీ చదవండి: Hair Growth: షాంపూ, నూనెలు కాదు.. ఇలా మసాజ్ చేసినా జుట్టు మోకాళ్ల వరకు పెరగడాన్ని ఎవ్వరూ ఆపలేరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









