Diabetes Diet Tips: డయాబెటిస్ ఉన్నవారు మరమరాలు, అటుకుల్లో ఏది తినడం మంచిదో తెలుసా?

Diabetes Diet Tips For Good Health: మధుమేహం ఉన్నవారు తరచుగా ఆకలి వేయడం వల్ల ఏదో ఒకటి తింటూ ఉంటారు. కొంతమంది అటుకులతో పాటు మరమరాలను కూడా తింటూ ఉంటారు. నిజానికి అటుకులను కూరగాయలతో మిక్స్ ఉప్మా చేసుకొని తినడం వల్ల బోలెడు లాభాలు పొందవచ్చుని నిపుణులు తెలుపుతున్నారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 14, 2025, 09:04 AM IST
Diabetes Diet Tips: డయాబెటిస్ ఉన్నవారు మరమరాలు, అటుకుల్లో ఏది తినడం మంచిదో తెలుసా?

Diabetes Diet Tips For Good Health: మధుమేహంతో బాధపడేవారు ఆహారాలు తీసుకునే క్రమంలో తప్పకుండా పలు రకాలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కాబట్టి పెద్దగా అనారోగ్యకరమైన ఆహారాలు తినేందుకు ఇష్టపడరు. ముఖ్యంగా చాలామంది ఏవైనా చిరుదిండుగా తినాలనిపించినప్పుడు కొన్ని రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు తింటూ ఉంటారు. ఇందులో భాగంగానే చాలామంది మురమురా తోపాటు ఫ్రై చేసిన అటుకులను తింటూ ఉంటారు. ఎందుకంటే వీటిని మధుమేహం ఉన్నవారు తినడం చాలా సేఫ్ అని అనుకుంటారు. నిజానికి ఇలా తినడం మంచిదేనా.? అటుకులు తినడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు నియంత్రించుకోవచ్చా? లేదా మరమరాలు తినడం మంచిదా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

నిజానికి మధుమేహంతో బాధపడేవారు గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉంటే వేయించిన శనగలను ఎక్కువగా చిరుదిండిగా తింటూ ఉంటారు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 30 నుంచి 60 మధ్య ఉంటుంది. నిజానికి వీటిని రోజు తినడం వల్ల రక్తంలోని చక్కర స్థాయిలు ఎప్పుడు నిలకడగా ఉంటాయి. పెరగకుండా తగ్గకుండా మద్యస్థ స్థాయిలలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే చాలామంది సలాడ్స్‌లో భాగంగా టర్నిప్స్ కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. వీటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) 70 నుండి 80 వరకు ఉంటుందని చాలామందికి తెలియదు. వీటిని తినడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సలాడ్స్ లో భాగంగా వీటిని వినియోగించకపోవడం చాలా మంచిది.

ముఖ్యంగా ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా టర్నిప్‌లతో తయారుచేసిన ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. వీటికి బదులుగా శనగలతో చేసిన ఆహారాలు తినడం చాలా మంచిది. దీనివల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలను ఎప్పుడూ నియంత్రించుకోవచ్చు. మరి కొంతమంది అయితే ఓట్స్, కార్న్‌ఫ్లేక్స్ లేదా బ్రౌన్ బ్రెడ్ కూడా తింటూ ఉన్నారు. వీటిని తినడం వల్ల జీర్ణ క్రియ పూర్తిగా దెబ్బతిని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి శనగలను ఈ ఆహారాల్లో వినియోగించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

మరి కొంతమంది అయితే ప్రాసెస్ చేసిన మరమరాలను ఎక్కువగా తింటూ ఉన్నారు. అంతేకాకుండా మరికొంతమంది అటుకులను ఎక్కువగా తింటున్నారు. నిజానికి ప్రతిరోజు మరమరాల కంటే అటుకులను పోహాగా తయారు చేసుకుని తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మధుమేహం ఉన్నవారు అటుకులను ఎక్కువగా కూరగాయలను వేసుకొని ఉప్మా లాగా తయారు చేసుకొని తినడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు కూడా తగ్గిపోయి.. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా శరీరానికి ఐరన్ తో పాటు విటమిన్ బి కూడా పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు పోహా తినడమే బెటర్ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News