)
Muskmelon Seeds Health Benefits: కర్బూజ పండు నుండి విత్తనాలను ఈజీగా వేరు చేయవచ్చు. ఎండకి లేదా ఫ్యాన్‌లో కొంత సమయం పాటు ఆరిన తర్వాత.. ఈ విత్తనాలను స్టోర్ చేసుకోవచ్చు. ఇదంతా చాలా సమయం పడుతుందనుకుంటే.. మీరు మార్కెట్లో కూడా కర్బూజ విత్తనాలను కొని తెచ్చుకోవచ్చు. మీ డైట్లో కర్బూజ గింజలను చేర్చుకోవడం వల్ల వివిధ రకాల పోషకాలను పొందవచ్చు.
కర్బూజ విత్తనాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..
1. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
కర్బూజ గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఒమేగా-3లు మొత్తం గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి.. అలాగే గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రసిద్ధి చెందాయి. కర్బూజ గింజలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సాయపడే శోథ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.
2. జీర్ణక్రియ ఆరోగ్యం
కర్బూజ గింజల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. మీ ఆహారంలో తగినంత డైటరీ ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. అది క్రమంగా ప్రేగు కదలికను సులభతరం చేసేలా చేస్తుంది. మలబద్ధకాన్ని అరికట్టుతుంది. ప్రేగులను ఆరోగ్యకరమైనదిగా మారుస్తుంది.
3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
కర్బూజ గింజలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి. ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతాయి. ఈ గింజల్లో విటమిన్ సి పుష్కలంగా, రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు తోడ్పడే వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
4. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు పోషణ
కర్బూజ గింజల్లో విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ పోషకాలు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మం వృద్ధాప్యాన్ని మరింత ఆలస్యం చేస్తాయి. తద్వారా యంగ్‌గా ఉండవచ్చు.
5. ఎముకలను పటిష్టంగా ఉంచుతాయి
కర్బూజలో ఉండే అధిక మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ కంటెంట్ ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుంది. మీ ఎముకలను బలోపేతం చేసే ఇలాంటి ఆహారాలు బోలు ఎముకల వ్యాధి వంటి ఎముక సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయి.
కర్బూజ విత్తనాలను ఎలా ఉపయోగించాలంటే..
సలాడ్లు, పెరుగు లేదా ట్రైల్ మిక్స్‌లో కొన్నింటిని మీ డైట్లో చేర్చుకోండి. వీటిని వేయించి, టాపింగ్ లేదా స్ప్రెడ్‌గా కూడా ఉపయోగించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.