
Soursop/Hanuman Fruit Health Benefits: మన రోజువారీ జీవితంలో దానిమ్మ, ఆపిల్, అరటి పండ్లు, ద్రాక్ష వంటి పండ్లు తింటూ ఉంటాం. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంచివని.. ఎంత ఖరీదైనా సరే ఈ పండ్లను కొని తింటూ ఉంటాం. అయితే వీటన్నింటికీ మించిన ఒక ప్రత్యేక పండు ఉంది. ఈ రకరకాల పండ్లలో ఉండే లాభాలన్నీ.. ఈ ఒక్క పండులోనే ఉన్నాయి. ఈ అరుదైన పండు పేరు హనుమాన్ పండు. దీన్ని బయటనుండి చూస్తే సీతాఫలం, రామాఫలం లాగా ఉంటుంది. కానీ దీని తొక్కపై ముళ్లు ఉంటాయి. ఇక ఈ పండు లోపల సీతాఫలం లాగే ఉంటుంది.
ఈ పండు ఎక్కడ దొరుకుతుంది..
ఈ హనుమాన్ పండు ఎక్కువగా మెక్సికో, దక్షిణ అమెరికా మరియు ఉష్ణమండల ప్రాంతాలలో పండిస్తారు. ఇది మన భారతదేశంలో అంతగా కనిపించదు.. కానీ కొన్ని ప్రదేశాలలో పెరుగుతూ కనిపిస్తుంది. ఈ హనుమాన్ పండు శాస్త్రీయ నామం అన్నోనా మురికాటా.
టేస్ట్ ఎలా ఉంటుంది..
హనుమాన్ పండు రుచి ప్రత్యేకంగా ఉంటుంది. కొంచెం తీపిగా మరియు కొంచెం పుల్లగా ఉంటుంది. దీనిని తిన్న వారు ఇది పైనాపిల్ మరియు స్ట్రాబెర్రీలా మిక్స్డ్ ఫ్లేవర్‌తో ఉంటుందని చెబుతారు. అందువల్ల ఈ పండు తినడానికి చిన్నపిల్లలు కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తారు.
హనుమాన్ ఫ్రూట్లో ఉండే పోషకాలు..
ఒక 100 గ్రాముల హనుమాన్ పండులో.. 81 గ్రాములు నీరు, 3.3 గ్రాముల ఫైబర్, 1 గ్రామ్ ప్రోటీన్, 278 mg పొటాషియం, 14 mg కాల్షియం, 21 mg మెగ్నీషియం మరియు విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఈ పండు మన శరీరానికి అవసరమైన శక్తి, ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
* హనుమాన్ పండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా వృద్ధాప్యాన్ని కూడా తగ్గిస్తాయి.
* ఈ పండు తినడం వల్ల శరీరంలో బ్యాక్టీరియా వ్యాప్తి తగ్గుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా సహాయపడుతుంది.
* ఈ హనుమాన్ పండు వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ఆర్థరైటిస్ మరియు ఇతర వాపు సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది.
* ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.
* డయాబెటిస్‌ని, రక్తపోటును, జీర్ణక్రియను, లివర్ ఆరోగ్యాన్ని కాపాడంలో హనుమాన్ పండు ప్రధాన పాత్ర పోషిస్తుంది.
* హనుమాన్ పండు ఒక అరుదైన మరియు ఆరోగ్యకరమైన పండు. శాస్త్రవేత్తలు ఈ పండులో సుమారు 212 రకాల రసాయనాలను కనుగొన్నారు. వీటిలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్లు వంటివి ఉన్నాయి. ఇవి శరీరంలోని వివిధ భాగాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ పండు శరీరానికి బలాన్ని ఇస్తుంది మరియు అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ దీనిని ఔషధంగా ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook