)
Lipstick with the Heaviest Price: లిప్‌స్టిక్ మహిళలు రోజూ వాడే సౌందర్య సాధనం. సాధారణంగా దీని ధర కొన్ని వందలు లేదా వేల రూపాయలు ఉంటుంది. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లిప్‌స్టిక్ ధర అక్షరాలా $14 మిలియన్లు. అంటే భారత కరెన్సీలోసుమారు 115 కోట్ల రూపాయలు. దీని పేరు H. Couture Beauty Diamond Lipstick.
ఈ లిప్‌స్టిక్ ఇంత ఖరీదైనది కావడానికి కారణం దాని కేస్. ఈ కేస్‌ను 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. అంతేకాదు దానిపై 1200 పింక్ కలర్ వజ్రాలను జాగ్రత్తగా పొదిగారు. ఇది కేవలం లిప్‌స్టిక్‌గా కాకుండా ఒక ఆభరణంలా, కళాఖండంలా తయారైంది.
ఈ బ్రాండ్ గతంలో 115 కోట్ల విలువైన మస్కారాను కూడా తయారు చేసింది, దాని కేస్‌పై 2500 బ్లూ కలర్ వజ్రాలు ఉపయోగించారు. ఈ లిప్‌స్టిక్‌తో కొనుగోలుదారులకు జీవితకాల సేవలు, ఎప్పుడూ అందుబాటులో ఉండే సపోర్ట్.. ఉచిత రిఫిల్స్ వంటి విలాసవంతమైన సౌకర్యాలు లభిస్తాయి.
ఈ లిప్‌స్టిక్ సామాన్యుల కోసం కాదు.. కోటీశ్వరులు లేదా కళాఖండాల సేకరణకు ఆసక్తి ఉన్నవారి కోసం రూపొందించబడింది. దీని విలువ లిప్‌స్టిక్ రంగులో లేదు, బంగారం, వజ్రాలు, విలాసవంతమైన సేవల్లో ఉంది. ఇది సంపద, విలాస జీవనశైలికి చిహ్నంగా నిలుస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook