Dragon Fruit Benefits: డ్రాగన్ పండులో పోషకాలు పుష్కలం. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఇందులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. అయితే డ్రాగన్ పండును మన డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...
రెగ్యులర్ గా డ్రాగన్ పండును తీసుకోవడం వల్ల ఇది ఫ్రీ బయోటిక్ ఫైబర్ కలిగి ఉంటుంది. దీంతో మన కడుపులో మంచి బ్యాక్టీరియా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది కడుపులో గ్యాస్, అజీర్తిని తగ్గించేస్తుంది
డ్రాగన్ పండు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. తద్వారా సీజనల్ జబ్బులు రాకుండా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలంగా మారుస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్, మంట సమస్యను తగ్గిస్తుంది. దీంతో ప్రాణాంతక వ్యాధుల నుంచి దూరంగా ఉంటారు.
డ్రాగన్ పండు గుండా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ ,యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఇది కార్డియో ఆరోగ్యానికి మంచిది. డ్రాగన్ పండు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించేస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
అంతేకాదు డ్రాగన్ పండు మంచి ఎలక్ట్రో లైట్ లో పనిచేస్తుంది. ఇందులో 80 శాతానికి పైగా నీరు కలిగి ఉంటుంది. తద్వారా ఈ ఎండాకాలం మనకు మంచి హైడ్రేషన్ నిలుపుతుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటుంది.
ఈ పండు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగనివ్వదు. ఇది ఎప్పటికప్పుడు నిర్వహిస్తుంది. గ్లూకోజ్ గ్రహించడాన్ని నెమ్మదిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం షుగర్ వ్యాధిగ్రస్తులు డ్రాగన్ పండు తినవచ్చు. ఇందులో ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల వారి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
ఇదీ చదవండి: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..
ఇదీ చదవండి: జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ ద్వారా ఫలితాలు తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









