Hot Water And Ghee Combination: ఆయుర్వేద పరంగా నెయ్యిలో ఔషధ గుణాలు పుష్కలం. అయితే ఎన్నో నివేదికలు కూడా నెయ్యిలో అద్భుత గుణాలు ఉన్నాయని చెబుతున్నాయి. ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి వేసుకుని తీసుకోవటం వల్ల అద్భుత ప్రయోజనం. ఇలా నెయ్యి వేసి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఉదయం గోరువెచ్చని నీటిలో నెయ్యి వేసుకుని తీసుకోవటం వల్ల వాతం తగ్గిపోతుంది. అంతేకాదు ఇది జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. దీంతో కడుపులో అజీర్తి, యాసిడిటీ కూడా తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు కూడా ఈ నీళ్లు తోడ్పడుతాయి.
ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి తీసుకోవటం వల్ల ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇది మన శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిచేస్తుంది. తద్వారా మన శరీరం మంచి డిటెక్సిఫికేషన్ అయిపోతుంది. దీంతో ప్రాణాంతగా వ్యాధులు కూడా మన దరిచేరకుండా ఉంటాయి. నీరసం వంటివి కూడా తగ్గిపోతాయి. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు ఉదయం పరగడుపున ఈ నీటిని తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు కూడా మెరుగవుతుంది. అంతేకాదు అతిగా తినాలని అనిపించదు. తద్వారా బరువు పెరగకుండా ఉంటారు.
ఉదయం పరగడుపున ఈ నీటిని తీసుకోవటం వల్ల మన చర్మం మంచి హైడ్రేషన్ అందుతుంది. ఇందులో విటమిన్ ఏ విటమిన్ ఇ ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. మంచి కణాలకు పునరుజ్జీవనం అందిస్తుంది.ముఖంపై వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా రాకుండా కాపాడుతుంది. నెయ్యి బ్రెయిన్ ఆరోగ్యానికి కూడా మంచి టానిక్ అని చెప్పాలి. రెగ్యులర్ గా నెయ్యిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల మెదడు బాగా పనిచేస్తుంది. ఆ మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
READ ALSO: ఘోర ప్రమాదం.. నైట్ క్లబ్ పైకప్పు కూలి 184 మంది మృత్యువాత, వీడియో చూడండి..
నిపుణులు అభిప్రాయం ప్రకారం ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల కీళ్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇందులో విటమిన్ K2 ఉంటుంది. ఇది క్యాల్షియం గ్రహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా ఎముకలు బలంగా మారుతాయి. నెయ్యి ఈస్ట్రోజన్, ప్రొజెస్టరన్ హార్మోన్ల పునరుత్పత్తికి కూడా తోడ్పడుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. దీంతో పీరియడ్ సమయంలో వచ్చే కడుపులో గ్యాస్‌కు కూడా చెక్ పెడుతుంది. అయితే ఒక కప్పు నీటిలో ఒక చెంచా నెయ్యి వేసి తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల మంచిది. ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల గరిష్ట లాభాలు పొందుతారు.
READ ALSO: ఎండ వేడిమిలో డిహైడ్రేషన్‌కు గురికాకుండా నీళ్లలో ఇవి కలుపుకొని తాగండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









