Weight Loss Veggies: ప్రతిరోజు కూరగాయలో జ్యూస్ మన డైట్ లో చేర్చుకుంటే బరువు ఈజీగా తగ్గిపోతారు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి కూడా మంచి నిద్ర పడుతుంది. జీర్ణక్రియ కూడా తోడ్పడుతుంది కూరగాయల జ్యూస్ తీసుకోవడం వల్ల మన శరీరంలో విష పదార్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది. తద్వారా బరువు కూడా తగ్గిపోతారు..
కీరదోస ..
కీరదోస ఎండాకాలంలో విపరీతంగా విక్రయాలు చేపడతారు. ఈనేపథ్యంలో కీరదోస, పుదీనాను కలిపి జ్యూస్ చేసుకుని తీసుకోవడం వల్ల మన శరీరంలో విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. మంచి తాజాదనం అందిస్తుంది. అంతేకాదు కడుపుకు హాయిని అందిస్తుంది. ఇక సహజంగా బరువు కూడా తగ్గిపోతారు.
క్యారెట్
క్యారెట్, బీట్ రూట్ కలిపి జ్యూస్ తయారు చేసుకొని ఉదయం పూట తీసుకోవడం వల్ల మంచిది. ఇందులో ఫైబర్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ జ్యూస్ కడుపు నిండిన అనుభూతి కూడా ఎక్కువ సమయం పాటు కల్పిస్తుంది. తద్వారా మెటబాలిజం రేటు పెరుగుతుంది. దీంతో మీ లివర్ సహజసిద్ధంగా క్లెన్స్ అయిపోతుంది.
టమాట..
ఉదయం టమాట, నిమ్మరసం కలిపిన జ్యూస్ తీసుకోవడం వల్ల క్యాలరీలు తక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది బెల్లీ ఫ్యాట్ తగ్గించేస్తుంది. ఇమ్యూనిటీ స్థాయిలను కూడా పెంచేస్తుంది. ఈ రెండు కలిపి తీసుకుంటే మంచి జీర్ణ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది.
ఇదీ చదవండి: : ఐపీఎల్ వేళ జియో బంపర్ ప్లాన్.. 50 రోజుల వైఫై ఫ్రీ, మూడు నెలల హాట్ స్టార్ స్ట్రీమింగ్..
ఉసిరి రసం డైట్ లో చేర్చుకోవడం వల్ల కూడా మంచి శక్తి అందుతుంది. పాలకూరలో ఉసిరి రసం వేసుకుని తీసుకుంటే మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాదు మన శరీరంలో ఉండే విష పదార్థాలు బయటికి పోతాయి. మెటబాలిజం రేటును బలంగా మారుస్తుంది. దీంతో కడుపు నిండు అనుభూతిని కల్పిస్తుంది. క్యాలరీలు కూడా తక్కువ ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ జ్యూస్ అని చెప్పాలి.
ఇది మాత్రమే కాదు సొరకాయ రసం తీసుకుంటే కూడా మంచి ఫలితాలు కల్పిస్తాయి. ఎండాకాలం ఇది కడుపు చల్లగా బరుస్తుంది. అందుకే కాదు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఎండాకాలం ఉదయం పూట తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి బరువు కూడా తగ్గిపోతారు.
ఇదీ చదవండి: స్కూళ్లకు సెలవులు.. కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









