Healthy Juice For Eyes: మన శరీరంలో కళ్ల ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్యం. కంప్యూటర్, మొబైల్ స్క్రీన్లను ఎక్కువగా ఉపయోగించడం, ఆరోగ్యరాహిత్యమైన ఆహారం తీసుకోవడం వల్ల కంటి దృష్టి బలహీనత, పొడి కళ్ల సమస్యలు, చూపు మందగించడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ ప్రాబ్లమ్స్‌తో భాదపడుతున్నారు. కానీ, మన రోజువారీ జీవితంలో చేసుకునే చిన్న మార్పుల వల్ల కళ్ల సమస్యలను నయం చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఒక జ్యూస్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. అదే క్యారెట్ జ్యూస్. ఇది నిజంగా మ్యాజికల్ జ్యూస్ అనే చెప్పాలి. మరి క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కళ్లకు కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే కంటి ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
1. చూపు మందగించకుండా నిరోధించగలదు
క్యారెట్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కంటిలో కణజాలాన్ని రక్షించి, వృద్ధాప్యం వచ్చే చూపు సమస్యలను దూరం చేస్తుంది.
2. రాత్రి సమయంలో చూపు మెరుగుపడుతుంది
బీటా కెరోటిన్ ద్వారా విటమిన్ ఏ శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఇది రాత్రిపూట స్పష్టంగా చూసే శక్తిని అందిస్తుంది.
3. పొడి కళ్ల సమస్యలు తగ్గుతాయి
విటమిన్ ఏ కంటి లోపల తేమను నిలుపుతుంది. రోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కంటి పొడిబారడం తగ్గుతుంది.
4. మాక్యులర్ డిజెనరేషన్ ప్రమాదం తగ్గుతుంది
క్యారెట్‌లో ఉండే లూటిన్, జీఝాంటిన్ వంటి పదార్థాలు దీర్ఘకాలిక కంటి సమస్యల రాకుండా కంటిని రక్షిస్తాయి.
5. కంటి అలసట, ఒత్తిడి తగ్గుతుంది
కంప్యూటర్, మొబైల్స్ ఎక్కువగా వాడేవారు క్యారెట్ జ్యూస్ తీసుకుంటే కంటికి సహజ శక్తి, తాజాతనం లభిస్తుంది.
క్యారెట్‌లో దాగి ఉన్న పోషకాలు..
బీటా-కెరోటిన్..
ఇది శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది. ఇది కంటి దృష్టికి అత్యంత అవసరం.
లూటిన్..
ఇది కంటి లోపలి భాగాన్ని UV కిరణాల నుండి రక్షిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు..
కంటి కణజాలాన్ని కాపాడి వృద్ధాప్య దృష్టి సమస్యలు (మాక్యులర్ డిజెనరేషన్) తగ్గిస్తాయి.
విటమిన్ C & E..
కంటిలో ఏర్పడే ఒత్తిడిని తగ్గిస్తూ, చూపును మెరుగుపరుస్తాయి.
క్యారెట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలంటే..
క్యారెట్లను బాగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని మిక్సీలో వేసి కొద్దిగా నీరు కలిపి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. దానిని ఫిల్టర్ చేసి మీకు నచ్చితే తేనె, నిమ్మరసం కలిపి తాగవచ్చు. లేదంటే అలానే తాగేయవచ్చు. ఈ జ్యూస్ ఉదయం ఖాళీ కడుపుతో, మధ్యాహ్నం భోజనానికి ముందుగా తాగడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి. ఇలా వారానికి 4 నుంచి 5 సార్లు తాగడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Also Read: Pumpkin Juice: గుండె నుండి లివర్ వరకు చలికాలంలో గుమ్మడికాయ జ్యూస్‌తో కలిగే ప్రయోజనాలు ఇవే..!
Also Read: Health Tips: ఈ చిన్న చిట్కాలను పాటించండి.. మీ షుగర్ లెవెల్ 400 నుండి 100కి రావడం పక్కా గ్యారంటీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









