Strawberry Fruit: ఆహారంలో పండ్లు.. కూరగాయలు అధిక మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లు.. కూరగాయలు అనేవి బరువు పెరగకుండా నియంత్రణ చేస్తాయి. అంతేకాకుండా బరువు తగ్గడానికి ఇతోధికంగా దోహదం చేస్తాయి. పండ్లలో స్ట్రాబెర్రీ బరువు తగ్గుదలకు అద్భుతంగా పనిచేస్తుంది. బరువును తగ్గించడంలో స్ట్రాబెర్రీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగి ఉండే స్ట్రాబెర్రీలు బరువు తగ్గడానికి సాయపడతాయి. స్ట్రాబెర్రీలు తినడం వలన కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచి అతిగా తినకుండా నివారిస్తాయి. దీనివలన బరువు నియంత్రణలో స్ట్రాబెర్రీలు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా స్ట్రాబెర్రీలు మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో స్ట్రాబెర్రీలు కీలక పాత్ర పోషిస్తాయి. అధిక మొత్తంలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు వీటిలో ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. దీనివలన గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో కూడా దోహదం చేస్తుంది.
స్ట్రాబెర్రీలలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కంటి చూపును మెరుగుపరచడంలో స్ట్రాబెర్రీలు చాలా సహాయపడుతాయి. స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటిశుక్లం ఇతర కంటి వ్యాధుల రాకుండా దోహదం చేస్తుంది.
స్ట్రాబెర్రీలలో ఎలాజిక్ ఆమ్లం ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో స్ట్రాబెర్రీలు దోహదపడతాయి . తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉండడంతో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతాయి. ఇది మధుమేహ రోగులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన పండుగా స్ట్రాబెర్రీలను భావిస్తారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









