Apple Fruit As Tiffin: మనలో చాలామంది ఉదయాన్నే యాపిల్ పండ్లను తినేందుకు అంతగా ఇష్టపడరు. నిజానికి ప్రతిరోజు ఉదయం పూట యాపిల్ పండ్లను తినడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో లభించే ఫైబర్, పొటాషియం, విటమిన్ సి అన్ని రకాల వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే దీర్ఘకాలికంగా గుండె సమస్యలతో బాధపడుతున్న వారు ఉదయం అల్పాహారంలో భాగంగా ఈ పండ్లు చేర్చుకుంటే విశేషమైన లాభాలు పొందుతారు. మధుమేహం ఉన్నవారు కూడా యాపిల్ పండ్లు ఉదయాన్నే తింటే అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. అయితే ఈ పండ్లను అల్పాహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బరువు తగ్గడానికి..:
బరువు తగ్గాలనుకునేవారు ప్రస్తుతం వ్యాయామశాలలలో ఎంతో కష్టపడినప్పటికీ ఫలితాలు పొందలేకపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే కొత్త కొత్త వైద్య చికిత్సలను కూడా చేయించుకుంటున్నారు. ఇలా ఎన్ని చేసినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. అయితే ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా యాపిల్స్ ను చేర్చుకోవడం వల్ల అద్భుతమైన లాభాలు పొందగలుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాపిల్ లో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరిచి శరీర బరువును నియంత్రిస్తుంది..
గుండె ఆరోగ్యానికి:
చాలామంది యువతలో గుండె సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆధునిక జీవనశైలితో పాటు ఎన్నోరకాల అనారోగ్యకతమైన ఆహారాలు రోజు తినడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే గుండె సమస్యల బారిన పడకుండా ఉండడానికి యాపిల్ పండ్లు ఎంతగానో సహాయపడతాయి. ఇందులో పుష్కలంగా విటమిన్ సితోపాటు ఫైబర్, పొటాషియం లభిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
మధుమేహానికి చెక్:
ప్రస్తుతం యువతలో మధుమేహం సమస్య కూడా విపరీతంగా పెరుగుతూ వస్తోంది. చాలామంది చిన్న వయసులోనే మధుమేహం వారిన పడి ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. కొంతమందిలో చక్కెర పరిమాణాలు పెరగడం తగ్గడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి, మధుమేహం తగ్గడానికి యాపిల్ పండ్లు ఎంతో సహాయపడతాయి. ఇందులో లభించే ఫైబర్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహాన్ని నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
యాపిల్‌లో ఫ్లేవనాయిడ్స్ తో పాటు యాంటీ క్యాన్సర్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా యాపిల్స్ తినడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఇప్పటికే క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఉదయం తప్పకుండా ఒక యాపిల్ పండు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్ పండ్లు తినడం వల్ల ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









