Jaggery: సమ్మర్‌లో బెల్లం తినడం మంచిదేనా? కలిగే లాభాలు ఇవే..!

Jaggery Benefits For Health: వేసవిలో బెల్లం తినడం వల్ల బోలెడు లాభాలు పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బెల్లంలో అనేకరకమైన పోషకాలు ఉంటాయి కాబట్టి ఇది వేసవిలో కలిగే కొన్ని ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే బెల్లం ఎలా తీసుకోవాలి, దీని వల్ల కలిగే ఆరోగ్యలాభాల గురించి మనం తెలుసుకుందాం.   

Written by - Shashi Maheshwarapu | Last Updated : Apr 19, 2025, 11:40 AM IST
Jaggery: సమ్మర్‌లో బెల్లం తినడం మంచిదేనా? కలిగే లాభాలు ఇవే..!

Jaggery Benefits For Health: వేసవిలో బెల్లం తినడం ఆరోగ్యానికి మంచిదా లేదా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. సాధారణంగా బెల్లంను మనం వంటల్లోనికి, ఔషధంగా ఉపయోగిస్తాము. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబరచడంలో సహాయపడుతుంది. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే వేసవి కాలంలో బెల్లం తీసుకోవడం వల్ల ఎలాంటి కలిగే ప్రయోజనాలు  కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

వేసవిలో బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

శరీరాన్ని చల్లబరచడంలో: ఆరోగ్యనిపుణుల ప్రకారం, వేసవికాలంలో బెల్లం తినడం వల్ల శరీరం వేడి తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజు ఒక చిన్న ముక్క బెల్లం తినడం మంచిది. దీని ఎక్కువగా కాకుండా తక్కువగా తీసుకోవడం ఉత్తమం. 

తక్షణ  శక్తిని పొందవచ్చు: వేసవికాలంలో నీరసంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో బెల్లం పానీయం లేదా బెల్లం తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.  దీంతో పాటు ఆరోగ్యకరమైన  శీతల పానీయాలు తాగ్గండి.

జీర్ణక్రియ: చాలా మంది భోజనం తర్వాత బెల్లం తింటారు. కొందరు పెరుగు అన్నంలోకి బెల్లం కలిపి తింటారు. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది నిపుణులు చెబుతున్నారు. వేసవిలో జీర్ణసమస్యలు కలుగుతాయి కాబట్టి బెల్లం తినడం వల్ల ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. 

రోగనిరోధక శక్తి: బెల్లంలో ఐరన్‌, యాంటీఆక్సిడెంట్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోనిరోధకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతాయి. అలాగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా రక్షిస్తాయి. 

అధిక రక్తపోటు: వేసవిలో రక్తపోటు సమస్యలు కలుగుతాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం బెల్లం తీసుకోవడం మంచిది. బెల్లంలో పొటాషియం అధికంగా ఉంటుంది. 

రక్తహీనతను తగ్గిస్తుంది: చాలా మంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. బెల్లం ఈ సమస్య తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఐరన్‌ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. 

వేసవిలో బెల్లం ఎలా తీసుకోవాలి?

బెల్లంను ఎన్నో విధాలుగా తీసుకోవచ్చు. అయితే దీని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. లేదంటే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. ఉదయం బెల్లం నీరు తాగడం మంచిది. లేదా పెరుగు అన్నంలో చిన్న బెల్లం ముక్క కలిపి తినవచ్చు.  కొబ్బరి నీళ్లలో కొద్దిగా బెల్లం కలిపి తీసుకోవడం కూడా మంచిది.

వేసవిలో బెల్లం తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:

బెల్లం ఆరోగ్యానికి మంచిది అయినప్పటికి దీని అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి. అధికంగా బెల్లం ఉపయోగించడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అంతే కాకుండా ఇది  కడుపు ఉబ్బరం, అసౌకర్యం కలగవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు వేసవిలో బెల్లం తీసుకొనే ముందు ఆరోగ్యనిపుణుల సలహా తీసుకోవడం మంచిది. బెల్లంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వేసవిలో తక్కువ శారీరక శ్రమ ఉండటం వల్ల అధికంగా బెల్లం తీసుకోవడం బరువు పెరగడానికి దారితీయవచ్చు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

Trending News