Holi Skincare Tips: హోలీ పండుగ ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. హిందువుల ముఖ్యమైన పండుగలో హోలీ ఒకటి. ఈ ఏడాది హోలీ పండుగ మార్చి 14వ తేదీ రానుంది. ముఖ్యంగా కొన్ని కెమికల్స్ ఉన్న రంగులు వాడకుండా హోం మేడ్ రంగులను ఉపయోగించడం మంచిది. అయితే హోలీ పండుగ మీరు కొబ్బరి నూనె ఉపయోగించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు.. దీనివల్ల జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
రంగులో ఉపయోగించే కెమికల్స్ వల్ల మన జుట్టు పొడిబారుతుంది. చర్మం కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కొబ్బరి నూనెను అప్లై చేసుకుని హోలీ పండుగ రోజు వేడుక చేసుకుంటే ఏ డ్యామేజ్ కాకుండా ఉంటుంది.. ముఖ్యంగా ఈ రంగుల వల్ల జుట్టు పొడిబారిపోతుంది. చర్మం కూడా పొడిబారిపోయే ప్రమాదం ఉంది.
హోలీ రంగులో వినియోగించే కెమికల్స్ మన చర్మానికి పడకపోవచ్చు. ఈ నేపథ్యంలో చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. ఈ రంగుల వల్ల చర్మంపై దురదలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అయితే కొబ్బరి నూనె అప్లై చేసుకొని హోలీ రంగులు ఉపయోగించడం వల్ల ఇది మన చర్మాన్ని ఒక షీల్డ్‌లా కాపాడుతుంది. కొబ్బరి నూనె అప్లై చేసి హోలీ ఆడటం వల్ల చర్మానికి పూర్తిస్థాయిలో రంగు అంటుకోకుండా ఉంటుంది. దురదలు, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.
హోలీ పండుగ చేసుకునే ముందు కొబ్బరి నూనె అప్లై చేసుకోవడం వల్ల ఆ రోజంతటికీ కావలసిన హైడ్రేషన్ చర్మానికి కొబ్బరి నూనె అందిస్తుంది. అంతేకాదు కొబ్బరి నూనెలో మంచి మాయిశ్చర్ గుణాలు ఉంటాయి.. చర్మానికి లోతైన పోషణ అందిస్తుంది. హోలీ ఆడుకునే ముందు చర్మంతో పాటు జుట్టుకు కూడా కొబ్బరి నూనె అప్లై చేయండి. దీనివల్ల జుట్టు పాడవ్వకుండా ఉంటుంది. అంతే కాదు ఇలా కొబ్బరి నూనె హోలీ ముందు అప్లై చేయడం వల్ల తలస్నానం చేసినప్పుడు త్వరగా రంగు జుట్టు నుంచి వదిలిపోతుంది. కొబ్బరి నూనె జుట్టుకు సహజసిద్ధమైన పోషణ అందిస్తుంది.. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది చర్మం మాత్రమే కాదు జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. మీ ప్రీ హోలీ రొటీన్‌లో కొబ్బరి నూనె యాడ్ చేయడం వల్ల చర్మం, జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి.
ఇదీ చదవండి: Hair Growth: షాంపూ, నూనెలు కాదు.. ఇలా మసాజ్ చేసినా జుట్టు మోకాళ్ల వరకు పెరగడాన్ని ఎవ్వరూ ఆపలేరు..
ప్రధానంగా హోలీ తర్వాత చాలామందికి చర్మ సమస్యలు వస్తాయి. దీంతో ఫంగస్ కూడా పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇలా ముందుగానే కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల ఇందులో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతాయి. అంతేకాదు ఇది సహజసిద్ధమైన యాంటీ సెప్లిక్‌లా కూడా పనిచేస్తుంది. కొబ్బరి నూనె వల్ల మీ చర్మం సహజ సిద్ధంగా మెరిసిపోతుంది. స్కిన్ మృదువుగా మారుతుంది. కొబ్బరి నూనె మనందరి ఇళ్లలో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. కాబట్టి హోలీ కి బయలుదేరే ముందు జుట్టు, ముఖం, స్కిన్ ఎక్స్‌పోజ్ అయ్యే ప్రాంతాల్లో ఈ కొబ్బరి నూనె అప్లై చేసి వెళ్లడం వల్ల జుట్టు, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాదు హోలీ రంగులు స్నానం చేసిన తర్వాత త్వరగా వదిలిపోతుంది.
ఇదీ చదవండి: పాపం.. బైకర్‌ను కాపాడబోయిన బస్సుకు చివరికి ఏం జరిగిందో చూడండి.. లైవ్ సీసీ ఫూటేజీ వీడియో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









