)
Beauty Tips: అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. కానీ చాలా మంది ముఖంపై మచ్చలు, మొటిమలు ఇబ్బంది పెడుతుంటాయి. మరికొందరు ముఖంపై నల్లటి పిగ్మెంటేషన్ ఇబ్బంది పెడుతుంది. దీన్ని వదిలించుకునేందుకు ఖరీదైన క్రీములు ఉపయోగిస్తారు. అయినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు. దీంతో నిరాశకు గురవుతుంటారు. అలాంటి వారికి ఆయుర్వేదం ఒక అద్భుతమైన మార్గాన్ని సూచించింది. ముఖంపై నల్లటి మచ్చలను తొలగించేందుకు నిపుణులు సూచించిన ప్రభావవంతమైన, సులభమైన ఇంటి నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా ఆకులు నల్లటి మచ్చలకు అద్భుత నివారణ అని చెబుతున్నారు. పుదీనా ఆకులను నీటితో కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ పేస్టును మచ్చలపై పూయాలి. ఇలా కొన్ని రోజుల్లో మచ్చలు తగ్గుతాయని చెబుతున్నారు నిపుణులు. పుదీనా ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, చర్మాన్ని రిఫ్రెష్ చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయ. ఇవి చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి మచ్చలపై త్వరగా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.
పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు ఇది ఆహారానికి మంచి రుచిని కూడా అందిస్తుంది. శరీరంలో అనేక రకాల సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులోని ప్రొటీన్ , మెంథాల్, విటమిన్ ఎ, రాగి, కార్బొహైడ్రేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ పుదీనా ఆకులు చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.
మీరు తాజా పుదీనా ఆకులను తీసుకుని రుబ్బుకుని అందులో కొంచెం నీళ్లు పోసి కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్టును మీ ముఖానికి అప్లయ్ చేసుకోవాలి. పుదీనా పేస్టును మీ ముఖంపై చక్కటి ప్యాక్ వలే అప్లయ్ చేయండి. పది నుంచి పదిహేను నిమిషాలు అలాగే ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడుక్కోవాలి.
ఈ పేస్టును వారానికి 2 నుంచి సార్లు ఉపయోగిస్తే అది మీ మచ్చలను మాయం చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా చేస్తే కొన్ని రోజుల్లో మీ ముఖంలో మంచి మెరుపు కనిపిస్తుంది. పుదీనా చర్మానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా అకాల వ్రుద్ధాప్యాన్ని నిరోధించే లక్షణాలను కలిగి ఉంటుంది. మాలిక్యులర్ డైవర్సిటీ పర్సుయేషన్ ఇంటర్నేషనల్ 2022పరిశోధన ప్రకారం పుదీనా యూవీ బి కిరణాల వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తుందని పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook