మీరు ఏ వైపు హత్తుకుంటారు?

మీరు ఏవైపు హత్తుకుంటారు అని మిమ్మల్ని అడిగితే.. ఎదో ఒకవైపులే.. ఎవరు గమనిస్తారు? అంటారా?

Updated: Jan 30, 2018, 07:36 PM IST
మీరు ఏ వైపు హత్తుకుంటారు?

మీరు ఏవైపు హత్తుకుంటారు అని మిమ్మల్ని అడిగితే.. ఎదో ఒకవైపులే.. ఎవరు గమనిస్తారు? అంటారా? ఎవరు గమనించక పోయినా మన మెదడు మాత్రం దీన్ని గమనిస్తుందట. సంతోషం, భావోద్వేగం, సానుకూల ధోరణిలో ఉన్నప్పుడు మనము ఎడమవైపున ఎదుటి వ్యక్తిని అమాంతం హత్తుకుంటామట. 

ఏడో మొక్కుబడిగా, తటస్థ వైఖరితో ఉన్నప్పుడు మన చేతులు కుడివైపుకు వెళ్తాయట. ఏ చేయి పైన ఉంటుందనేది సదరు వ్యక్తి చేతివాటంపైన, నడకలో ఏ వ్యక్తి కాలు మొదట ముందుకు వచ్చిందనే అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ అంశంపై జర్మనీ ఎయిర్ పోర్ట్ లో సుమారు రెండు వేల మందిని పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడిస్తున్నామని తెలిపారు సైక్రియాటిస్ట్ లు. కనుక  ఈ సారి మీరు ఇతరులను హత్తుకోనేందుకు వెళ్తే.. ఎటువైపు హత్తుకుంటున్నారో ఒకసారి గమనించండి.