Fibroid Awareness Month 2022: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది  మహిళల్లో  గర్భాశయ ఫైబ్రాయిడ్లు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా  గర్భాశయంలో చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారి గడ్డలకు దారి తీస్తుంది. అంతేకాకుండా ఈ సమస్యతో ఊబకాయం వంటి శరీర సమస్యలు కూడా ఉత్పన్నం కావడం విశేషం. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు  ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు పెరగడం, శరీరంపై శ్రద్ధ చూపకపోడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫైబ్రాయిడ్లు అంటే గర్భాశయంలో పనికి రాని మృదు కండర కణితులు. ఇవి పెరగడం వల్ల గర్భాశయంలో వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఇవి చిన్నవిగా ఉంటే శరీరానికి ఎంటా హాని ఉండదు. కానీ దీనిపై ఆశ్రద్ద వహించకూడదని నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గర్భాశయ ఫైబ్రాయిడ్ గురించి అపోహలు, వాస్తవాలు:


1. ఈ సంవత్సరంలోపు ఉన్న మహిళల్లో మాత్రమే ఫైబ్రాయిడ్లు ఉంటాయి:


గర్భాశయంలో ఫైబ్రాయిడ్ అన్ని వయసుల స్త్రీలను ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా  50 సంవత్సరాల వయస్సులో ఉన్నవారు 20 నుంచి 80 శాతం మంది మహిళల్లో ఫైబ్రాయిడ్లు అధికంగా అభివృద్ధి చెందుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా 30 నుంచి 40 సంవత్సరాల స్త్రీలలో ఫైబ్రాయిడ్ పెద్ద మొత్తంలో పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గినప్పడు ఫైబ్రాయిడ్లు అభివృద్ధి చెందే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు.


2. గర్భాశయంలో ఫైబ్రాయిడ్ల పెరిగితే తల్లి కాలేరు:


గర్భాశయంలో ఫైబ్రాయిడ్ల పెరగడం వల్ల సంతానోత్పత్తి సమస్యలు అధికమయ్యే అవకాశాలుంటాయని నిపుణులు తెలుపుతున్నారు. కావున తల్లి కావాలనుకునే కొరిక చివరి దాక మిగిలిపోతుంది. ఎప్పటికీ తల్లి కాలేరు. అయితే ఇది ఫైబ్రాయిడ్ రకం, పరిమాణంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


3. ఫైబ్రాయిడ్స్ వల్ల గర్భాశయంలో క్యాన్సర్:


స్త్రీ గర్భాశయ సమస్యతో బాధపడుతూ ఉంటే తప్పకుండా ఫైబ్రాయిడ్లు నిర్ధారణ పరీక్షను చేయించుకోవాలి. అంతేకాకుండా చాలా మంది మహిళలు ఫైబ్రాయిడ్లును క్యాన్సర్ గా భావిస్తున్నారు. కానీ ఇవి పెరడం వల్ల ఎలాంటి కాన్సర్స్‌ రావని నిపుణులు చెబుతున్నారు. కావున మహిళలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవరం లేదని నిపుణులు తెలుపుతున్రారు.


4. ఫైబ్రాయిడ్స్‌ పెరిగితే గర్భాశయాన్ని తొలగిస్తారా..!


గతంలో మహిళల ఫైబ్రాయిడ్‌లు పెరిగితే గర్భాశయాన్ని పూర్తిగా తొలగించేవారు.  ప్రస్తుతం సాంకేతికత పెరిగినందున గర్భాశయానికి శస్త్రచికిత్స చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం గర్భాశయ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ అందుబాటులోకి వచ్చిందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.


Read also:  Worst Breakfast Food: మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని అస్సలు తినొద్దు..!


Read also:  Swimming Benefits in Arthritis: ఎన్ని మందులు వాడిన ఆర్థరైటిస్ సమస్యలు తగ్గడం లేదా.. అయితే ఇలా చేయండి..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook