Fruit Juices In Summer: వేసవిలో పండ్ల రసాలు తాగుతున్నారా? ఇవి తప్పకుండా తెలుసుకోండి..

Fruit Juices In Summer: ప్రతి రోజు వేసవిలో పండ్ల రసాలు తాగడం మంచిదేనా? నిజానికి ప్రతి రోజు వేసవిలో పండ్ల రసాలు తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 22, 2025, 06:08 PM IST
Fruit Juices In Summer: వేసవిలో పండ్ల రసాలు తాగుతున్నారా? ఇవి తప్పకుండా తెలుసుకోండి..

Fruit Juices In Summer: వేసవిలో చాలా మందిలో డిహైడ్రేషన్‌ సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో వాటర్‌తో పాటు ఫ్రూట్‌ జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి రోజు వేసవిలో పండ్ల రసాలను తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. ఇందులో విటమిన్ సి, పొటాషియంతో పాటు విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇవే కాకుండా యాంటీఆక్సిడెంట్స్‌తో పాటు ఖనిజాలు కూడా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వేసవిలో పండ్ల రసాలు తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. 

Add Zee News as a Preferred Source

శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది: 
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం నీరసంగా మారుతుంది. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారిలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే పండ్ల రసాల్లో ఉండే సహజ చక్కెరలు త్వరగా రక్తంలో కలిసి తక్షణ శక్తిని అందించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. పండ్లలో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు అలసటను తగ్గించి ఉత్సాహంగా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

శరీరాన్ని హైడ్రేటెడ్‌ చేసేందుకు:
చాలా మందిలో ఎండా కాలంలో చెమట రూపంలో శరీరం ఎక్కువ నీటిని కోల్పోతుంది. దీని వల్ల హైడ్రేషన్ సమస్యలు వస్తాయి. అయితే పండ్ల రసాలు నీటితో నిండి ఉండటం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పుచ్చకాయ, ద్రాక్ష, నిమ్మ వంటి రసాలు శరీరానికి అవసరమైన నీటిని పుష్కలంగా అందిస్తాయి. దీని వల్ల వేసవిలో వచ్చే అనేక సమస్యలు దూరమవుతాయి.

విటమిన్లు, ఖనిజాలకు మూలం: 
వివిధ రకాల పండ్ల రసాల్లో విటమిన్ సి, విటమిన్ ఎతో పాటు పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలను దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది. అలాగే వేసవిలో పండ్ల రసాలు తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. 

జీర్ణక్రియ సమస్యలు: 
కొన్ని పండ్ల రసాల్లో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియను శక్తివంతం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా బొప్పాయి రసం తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే నారింజ, నిమ్మరసాలు జీర్ణకోశాన్ని శుభ్రపరచడానికి సహాయపడతాయి.

చర్మాన్ని ఆరోగ్యంగానికి..: 
పండ్ల రసాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించేందుకు కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి ఎంతగానో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News