Fruit Leaves For Sugar Patients: డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందలో కనిపించే ఒక సాధారణ సమస్య. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చాలా ముఖ్యం లేకపోతే ఇది గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, నరాల దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మధుమేహాన్నితగ్గించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే కొన్ని సహజమైన చిట్కాలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాంటి వాటిలో పండ్ల ఆకులు ఒకటి. కొన్ని రకాల పండ్ల ఆకులలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సమ్మేళనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇక్కడ చక్కెర స్థాయిలను తగ్గించే టాప్ 5 ఫ్రూట్ ఆకుల గురించి తెలుసుకుందాం.
మామిడి ఆకులు (Mango Leaves):
మామిడి ఆకులు మధుమేహానికి ఒక వరం. వీటిలో మాంగిఫెరిన్ ఉంటుంది ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. మామిడి ఆకులు ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి, గ్లూకోజ్ లెవల్స్‌ను తగ్గించడానికి సహాయపడతాయి.
ఉపయోగించే విధానం: 10-15 మామిడి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. రాత్రంతా అలానే ఉంచాలి. ఉదయం ఆ నీటిని వడపోసి ఖాళీ కడుపుతో త్రాగాలి. ఇలా కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
జామ ఆకులు (Guava Leaves):
జామ ఆకులు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిలో టానిన్లు, ఫ్లేవనాయిడ్లు మరియు ఇతర ఫైటోకెమికల్స్ ఉంటాయి, ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. జామ ఆకులు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి మరియు శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి సహాయపడతాయి.
ఉపయోగించే విధానం: కొన్ని జామ ఆకులను నీటిలో వేసి 10-15 నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి రోజుకు రెండుసార్లు త్రాగాలి. జామ ఆకుల టీ మధుమేహగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కరివేపాకు ఆకులు (Curry Leaves):
కరివేపాకు ఆకులు భారతీయ వంటకాలలో సాధారణంగా ఉపయోగించే పదార్థం. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. కరివేపాకు ఆకులలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి.
ఉపయోగించే విధానం: ఉదయం ఖాళీ కడుపుతో 8-10 తాజా కరివేపాకు ఆకులను నమలవచ్చు. లేదా కరివేపాకు ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు. మీ వంటకాల్లో కూడా కరివేపాకును ఎక్కువగా ఉపయోగించడం మంచిది.
వేప ఆకులు (Neem Leaves):
వేప ఆకులు వాటి ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. వేప ఆకులలో ఫ్లేవనాయిడ్లు, గ్లైకోసైడ్లు వంటి గుణాలు ఉంటాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
ఉపయోగించే విధానం: ఉదయం 5-6 తాజా వేప ఆకులను నమలవచ్చు. వేప ఆకుల రసం కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే వేప మితంగా ఉపయోగించాలి. తింటే ముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది.
లోక్వాట్ ఆకులు (Loquat Leaves):
లోక్వాట్ ఒక తీపి ,రుచి కలిగిన పండు. దీని ఆకులు కూడా మధుమేహానికి ఎంతో ఉపయో పడుతాయి. లోక్వాట్ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అధ్యయనాల ప్రకారం లోక్వాట్ ఆకుల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.
ఉపయోగించే విధానం: లోక్వాట్ ఆకులను నీటిలో వేసి మరిగించి టీలా తయారు చేసుకుని త్రాగవచ్చు. దీనిని ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
ముఖ్య గమనిక:
పైన తెలిపిన పండ్ల ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇవి మధుమేహానికి పూర్తిస్థాయి చికిత్స కావు. మీరు మధుమేహంతో బాధపడుతుంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. వారు సూచించిన ఆహారం, వ్యాయామం, మందులను తీసుకోవాలి. ఈ సహజ చిట్కాలు వైద్య సలహా మేరకు అదనపు సహాయంగా మాత్రమే ఉపయోగించవచ్చు.
ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









