Garlic Health Benefits: వెల్లుల్లి (Garlic) ఒక రకమైన దుంప జాతికి చెందిన మొక్క. వెల్లుల్లిని కూరల్లో వాడుతారు. దీని శాస్త్రీయ నామం "ఏలియం సాటివమ్" (Allium sativum). ఇది అల్లియం (Allium) ప్రజాతికి చెందినది. ఉల్లిపాయలు, ఉల్లికాడలు, ఉల్లిపువ్వులు, లీక్స్‌లు కూడా ఈ ప్రజాతికి చెందినవే. వెల్లుల్లిని ఆహారంలో వాడటం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి.
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఖాళీ కడుపుతో నాలుగు వెల్లుల్లి రెబ్బలు తినటం వల్ల మధుమేహాన్ని నయం చేస్తుంది. అలాగే రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే బరువు తగ్గవచ్చట. వెల్లుల్లిలో కార్బోహైడ్రేట్స్, కేలరీలు, డైటరీ ఫైబర్, చక్కెర పదార్థాలు, సోడియం, పొటాషియం, విటమిన్ సి, జింక్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ కె వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.
వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే కొన్ని ఉపయోగాలు:
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: వెల్లుల్లిలో జింక్, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి.
లైంగిక ఆరోగ్యాన్ని పెంచుతుంది: ప్రతిరోజు కాల్చిన వెల్లుల్లి తీసుకోవడం ద్వారా పురుషుల్లో లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి.
చుండ్రుని తగ్గిస్తుంది: ప్రతి రోజు కాల్చిన లేదా వేయించిన వెల్లుల్లిని తీసుకోవడం ద్వారా చుండ్రు బాధ నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
అలసటను నివారిస్తుంది: అలసట, నీరసం, నిస్సత్తువ అనిపించినప్పుడు వెల్లుల్లిని తింటే ఉత్సహంగా ఉంటారు.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది: వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగు పరుస్తుంది. గుండె జబ్బులతో బాధ పడేవారు ప్రతి రోజూ వెల్లుల్లి తినడం వల్ల గుండెకు రక్త ప్రసరణ అనేది మెరుగు పడుతుంది. గుండె పోటు రాకుండా జాగ్రత్త పడొచ్చని నిపుణులు అంటున్నారు.
ఒత్తిడి తగ్గిస్తుంది: వెల్లుల్లిలో సల్ఫర్ కాంపౌడ్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది గ్లూటాతియోన్ స్థాయిలను పెంచుతుంది. ఇది ఒత్తిడికి వ్యతిరేకంగా పని చేస్తుంది.
శరీరాన్ని క్లీన్ చేస్తుంది: వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు అనేవి అధిక మొత్తంలో ఉంటాయి. ఇది శరీర భాగాలను లోపల నుంచి శుభ్ర పరుస్తుంది.
వెల్లుల్లి అలెర్జీ లక్షణాలు:
దద్దుర్లు లేదా చర్మంపై దద్దుర్లు: చర్మంపై ఎరుపు, దురద వెల్ట్స్.
వాపు: ముఖ్యంగా ముఖం, పెదవులు, నాలుక గొంతు చుట్టూ.
శ్వాస సంబంధిత సమస్యలు: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక, ముక్కు దిబ్బెడ, లేదా ముక్కు కారటం.
జీర్ణకోశ లక్షణాలు: వికారం, వాంతులు, అతిసారం, లేదా కడుపు నొప్పి.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









