Gastric Problem Solution: ఆధునిక జీవనశైలి పాటించే వారిలో గ్యాస్టిక్ సమస్యతో పాటు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు సర్వసాధారణమే.. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల వల్ల చాలామందిలో ఈ సమస్యలు వస్తున్నాయి. కొంతమంది ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి అనేక రకాల ఆహార పదార్థాలను తినడం మానుకుంటున్నారు. కొంతమంది అయితే రసాయనాలతో కూడిన ఔషధాలు కూడా వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఫలితాలు పొందలేకపోతున్నారు. ముఖ్యంగా గ్యాస్టిక్ సమస్యతో బాధపడేవారు తప్పకుండా దీని నుంచి ఉపశమనం పొందడం మంచిది.. లేకపోతే అనేక రకాల పొట్ట సమస్యలకు దారి తీసే ఛాన్సులు ఉన్నాయి. ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, గ్యాస్టిక్ సమస్యతో బాధపడుతున్న వారు మూడు రకాల పండ్లను రోజు తినడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఎలాంటి పండ్లను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి.
గ్యాస్టిక్ ను తగ్గించుకోవడానికి ఈ పండ్లు తినండి.
1. అరటిపండు
గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే వారికి అరటిపండు ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో లభించే హై ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా అరటి పండులో ఉండే సహజమైన పోషకాలు కడుపును ఆరోగ్యవంతంగా ఉంచి, గుండెల్లో మంటను తగ్గించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అరటిపండు తేలికగా జీర్ణం అవుతుంది.. కాబట్టి ఇది జీర్ణ వ్యవస్థను శక్తివంతంగా మార్చే ఛాన్స్ ఉంది. అరటి పండులో లభించే బి6 విటమిన్‌తో పాటు సి విటమిన్ గ్యాస్టిక్ సమస్యను పూర్తిగా తగ్గించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.
2. బొప్పాయి పండు
బొప్పాయి పండు గ్యాస్ట్రిక్ సమస్యను పూర్తిగా తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో పాపైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ప్రోటీన్లను చేసేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే ఇందులో లభించి వివిధ రకాల పోషకాలు అజీర్ణంతో పాటు పొట్ట ఉబ్బరాన్ని తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపులో మంటను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
3. పుచ్చకాయ
పుచ్చకాయలో 90 శాతం నీరు లభిస్తుంది.. కాబట్టి ఇది శరీరాన్ని డిహైడ్రేషన్ నుంచి కాపాడేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. పుచ్చకాయ రోజు తినడం వల్ల గ్యాస్టిక్ సమస్య నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఇప్పటికే కడుపులో ఆమ్లత్వం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు పుచ్చకాయలను తినడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. పుచ్చకాయల్లో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి