Heart-leaved Moonseed Plant: ఆకు.. అన్ని రకాల రోగాలను నయం చేస్తుంది.. ఏంటి నమ్మట్లేదా..? ఒకే ఒక్క ఆకు శరీరంలోని మలినాలను భయటకి పంపివేస్తుంది.. స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను తగ్గించేస్తుంది.. అంతేకాకుండా ఇదే ఆకు జీర్ణక్రియ, ఆర్థరైటిస్ , డయాబెటిస్ వంటి చాలా రకాల వ్యాధులను నయం చేస్తుంది.
ఆ ఆకు పేరే తిప్పతీగ.. అవునండి.. గిలోయ్ అని పిలువబడే తిప్పతీగ ఆకు అనేక రకాల వ్యాధులను నయం చేయటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. తిప్పతీగ ఆకులను ఆయుర్వేదంలో ఒక ప్రముఖ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. దీనిని సంస్కృతంలో ‘అమృతవల్లి’ అని కూడా అంటారు. దీని ఆకులు శక్తివంతమైన ఔషధ గుణాలను కలిగి ఉండి, రోగనిరోధక వ్యవస్థను బలపరిచే అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటాయి. విషాన్ని తొలగించే గుణాలు, శరీరాన్ని చల్లబరిచే శక్తి కలిగి ఉంటాయి.. మొండి వ్యాధులను సైతం తగ్గించే ఈ ఆకు పౌడర్, జ్యూస్, క్యాప్సూల్స్ రూపంలో కూడా మనకు అందుబాటులో ఉంది. ఈ తిప్పతీగ ఆకుల వలన ఆరోగ్యానికి కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
రోగనిరోధక శక్తిలో పెరుగుదల:
సాధారణంగా ఆయుర్వేద శాస్త్రంలో తిప్పతీగ ఆకును రోగనోరోధక శక్తిని పెంచే ఔషధంగా వాడుతుంటారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో, శరీరాన్ని హానికరమైన టాక్సిన్స్ నుంచి రక్షిస్తుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు, జలుబు వంటి చలికాలంలో కలిగే వ్యాధులు రాకుండా ఉంటాయి.
జీర్ణవ్యవస్థలో మెరుగుదల:
జీర్ణ వ్యవస్థ సమస్యలు ఉన్నవారికి ఇదో గొప్ప ఔషధంగా చెప్పవచ్చు. తిప్పతీగ ఆకు ఆహారాన్ని త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను నివారించడంలో ఇది సహాయపడుతుంది. తాజా ఆకులతో తయారుచేసిన కషాయం లేదా పౌడర్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
రక్తాన్ని శుభ్రపరచడం మరియు చర్మ ఆరోగ్యం:
తిప్పతీగ ఆకులు శరీరంలోని హానికరమైన విషపదార్థాలను బయటకు పంపించి, రక్తాన్ని శుభ్రపరచడం ద్వారా చర్మ సమస్యలను తగ్గిస్తాయి. మొటిమలు, అలర్జీలు, ఈక్జిమా, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు ఇది బాగా పనిచేస్తుంది.
మధుమేహ నియంత్రణ:
తిప్పతీగ ఆకులు హైపోగ్లైసెమిక్ గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించటంలో సహాయపడతాయి. అందువల్ల, రక్తంలో చక్కర స్థాయిలు అధికంగా ఉన్నవారికి ఔషధంగా కూడా వాడవచ్చు.
ఆర్థరైటిస్ & గుండె ఆరోగ్యానికి మేలు:
యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండే తిప్పతీగ ఆకులు మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. అదే విధంగా, గుండె సంబంధిత సమస్యలను నివారించేందుకు కూడా దీనిని ఉపయోగిస్తారు.
మానసిక ఆరోగ్యంలో మెరుగుదల:
తిప్పతీగ ఆకులు నాడీ వ్యవస్థను మెరుగుపరిచే లక్షణాలు ఉంటాయి. అందువలన ఈ ఆకులను వాడటం ద్వారా మెదడు శక్తిని పెంచుకోవటమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఈ ఆకులు మానసిక ప్రశాంతతను చేకూర్చటంలో కూడా సహాయపడతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









