Bloating And Gastric: గ్యాస్టిక్‌ను తగ్గించే అద్భుతమైన టీలు.. రోజు తాగండి!

Bloating And Gastric: రోజు ఉదయాన్నే ఈ టీలు తాగితే గ్యాస్టిక్ సమస్య పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు ఈ రెమెడీలను తప్పకుండా వినియోగించండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 6, 2025, 01:11 PM IST
Bloating And Gastric: గ్యాస్టిక్‌ను తగ్గించే అద్భుతమైన టీలు.. రోజు తాగండి!

Bloating And Gastric: జీవనశైలిలో మార్పులతో పాటు హార్మోన్ల అసమతుల్యత, అనారోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తినడం, ఎక్కువగా నీటిని తాగకపోవడం, నిద్రలేమి సమస్యలు, ఇలా అనేక కారణాలవల్ల పొట్ట సమస్యలతో పాటు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా కొంత మందిలోనైతే అతి చిన్న వయసులోనే మలబద్ధకంతో పాటు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. పొట్టలో గ్యాస్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల కొంతమందిలో కడుపు ఉబ్బరం వంటి సమస్య కూడా వస్తోంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారే ఎక్కువగా వేయించిన ఆహారాలతో పాటు ఇతర అనారోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందట. అంతేకాకుండా పొట్ట కూడా బరువుగా మారే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ పొట్ట సమస్యలన్నిటికీ సులభంగా విముక్తి కలిగించే అనేక రకాల ఆయుర్వేద రెమిడీలు ఉన్నాయి. ఈ టాప్ రెమిడీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

సోంపు టీ:
రోజు ఉదయాన్నే సోంపుతో తయారు చేసిన టీ తాగడం వల్ల పొట్ట ఉబ్బరంతో పాటు గ్యాస్టిక్ సమస్య కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే కొన్ని గుణాలు జీర్ణ క్రియను వేగవంతంగా చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి. అయితే ఈ సోంపుటీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ముందుగా ఈ టీ ని తయారు చేసుకోవడానికి ఒక రోజు ముందే నీటిలో సోంపున నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత ఆ మరుసటి రోజు స్టవ్ పై బాగా మరిగించుకొని ఆ నీటిని వడగట్టుకుని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే.. గ్యాస్టిక్ సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది.

పుదీనా టీ:
పుదీనా టీలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే ఈ టీని హెర్బల్ టీగా పిలుస్తారు. పుదీనా ఆకుల్లో ఉండే అద్భుతమైన ఆయుర్వేద గుణాలు జీర్ణ వ్యవస్థను శక్తివంతంగా చేసేందుకు మేలు చేస్తాయి. అలాగే జీర్ణ క్రియను వేగవంతం చేసి గ్యాస్ట్రిక్ ను తొలగించేందుకు కీలక పాత్ర పోషిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ పుదీనా టీ రోజు తాగితే శరీరం కూడా రిలాక్స్ అవుతుంది. అయితే ఈ టీ ని తయారు చేసుకోవడానికి ముందుగా ఐదు నిమిషాల పాటు పుదీనా ఆకులను నీటిలో నానబెట్టుకోండి. ఆ తర్వాత ఆ నీటిని ఆకులతో పాటు మరిగించుకొని ఒక గాజు గ్లాసులోకి సర్వ్ చేసుకుని తేనె కలుపుకొని తాగండి. 

అల్లం టీ:
చాలామంది అలాంటి క్రమం తప్పకుండా తాగుతూ ఉంటారు. అలాంటి తాగడం వల్ల పొట్ట సమస్యలు వస్తూ ఉంటాయని కొంతమంది చెబుతూ ఉంటారు. నిజానికి అల్లం టీ రోజు తాగడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాంటి లో ఉండే అద్భుతమైన గుణాలు జీర్ణ క్రియ శక్తిని పెంపొందించేందుకు సహాయపడతాయి. ఇది పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి జీర్ణ క్రియ ప్రేగులను క్లీన్ చేసేందుకు అద్భుతంగా తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ అల్లం టీ ని కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక పెద్ద స్టీల్ బౌల్ తీసుకొని అందులో తగినంత నీటిని పోసుకొని అల్లం వేసుకోండి. అల్లం వేసుకున్న తర్వాత టీ పౌడర్ వేసుకొని బాగా ఉడికించుకోండి. ఉడికించుకున్న అల్లం టీ ని ఒక గాజు గ్లాసులో ఒకసారి చేసుకొని తగినంత తేనె వేసుకుని తాగండి..

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News