)
Gold In Dream Meaning: ప్రతి ఒక్కరికీ నిద్రలో కలలు వస్తుంటాయి. కానీ కొంతమందికి మాత్రమే కలలో కనిపించే వాటి గురించి అర్థం తెలుస్తుంది. ఇప్పుడు మీరు కలలో బంగారం కనిపిస్తే దాని అర్థం ఏమిటి? అది శుభమా.. లేదా అశుభమా అని ఇక్కడ తెలుసుకుందాం..
నిద్రలో కలలు కనడం సాధారణం. మధ్యాహ్నం నిద్రపోతున్నప్పుడు వచ్చే కలల గురించి ఎవరూ పట్టించుకోరు. కానీ తెల్లవారుజామున వచ్చే కలలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. కలలో వచ్చేది అప్పుడు జరుగుతుందని చాలామంది నమ్ముతారు.
ఈ కలలలో చాలా విషయాలు కనిపిస్తాయి. వాటిలో చాలా వాటి అర్థం మనకు ఇప్పటికే తెలుసు. కానీ కలలో బంగారం కనిపిస్తే దాని అర్థం ఏమిటో చాలామందికి తెలియదు. ఇప్పుడు కలలో బంగారం కనిపిస్తే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.
మీ కలలో బంగారం వస్తున్నట్లు లేదా పోతున్నట్లు కనిపిస్తే, మీరు ఆర్థికంగా నష్టపోతారని అర్థం. అలాంటి సమయాల్లో ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి. మీ కలలో తమలపాకు కనిపిస్తే, భవిష్యత్తులో మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అర్థం. మీరు పాత బంగారాన్ని అమ్మి కొత్త బంగారాన్ని కొనుగోలు చేసినా, అది జీవితంలో మంచిగా ఉంటుంది. మీరు ఆర్థికంగా బలంగా ఉంటారని అర్థం. మీ కలలో ఎవరైనా మీకు బంగారాన్ని బహుమతిగా ఇస్తే, మీ సంపద పెరుగుతుందని సూచిస్తుంది.
మీరు కలలో కొత్త బంగారం కొంటుంటే, మీ ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుందని మీరు అర్థం చేసుకోవాలి. మీరు చేసే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. అంతే కాకుండా ఆర్థిక వృద్ధి ఉంటుంది.
(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook