Golden Milk Benefits: అద్భతం.. మహా అద్భుతం.. గోల్డెన్ మిల్క్‌తో బంపర్‌ బెనిఫిట్స్‌!

Golden Milk Benefits: గోల్డెన్ మిల్క్‌ రోజు తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే మూలకాలు కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయి. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా శరీరానికి కలుగుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 4, 2024, 07:18 PM IST
Golden Milk Benefits: అద్భతం.. మహా అద్భుతం.. గోల్డెన్ మిల్క్‌తో బంపర్‌ బెనిఫిట్స్‌!

Golden Milk Benefits In Telugu: పసుపు పాలను ఆయుర్వేదంలో గోల్డెన్ మిల్క్‌గా పిలుస్తారు. ఇందులో శరీరానికి అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. అంతేకాకుండా కర్కుమిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. కాబట్టి రోజు పసుపు పాలు తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీంతో పాటు అనేక రకాల శక్తివంతమైన మూలకాలు ఉంటాయి. కాబట్టి రోజు తినడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. అయితే చాలా కాలంలో ప్రతి రోజు గోల్డెన్ మిల్క్‌ తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి. 

Add Zee News as a Preferred Source

పసుపు పాలు తాగడం వల్ల కలిగే లాభాలు:
రోగనిరోధక శక్తి: 

పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీనిని చలికాలంలో తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థను బలోపేతమవుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. 

జీర్ణ వ్యవస్థకు చెక్‌:
పసుపులో ఉండే ఆయుర్వేద గుణాలు పిత్తాశయాన్ని శక్తివంతంగా చేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను శక్తివంతంగా చేస్తాయి. కాబట్టి ప్రతి రోజు పసుపు పాలు తాగితే మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి.

వాపును తగ్గిస్తుంది: 
పసుపు పాలలో కర్కుమిన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది శరీరంలోని వాపును తగ్గించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు వంటి వాపు సంబంధిత వ్యాధులకు తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది:
పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి రోజు ఈ పసుపు పాలను తాగితే మొటిమలు, తామర వంటి చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. దీంతో పాటు చర్మం మెరిసేలా కూడా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

మెదడు సమస్యలు: 
పసుపు, పాలలో ఉండే కర్కుమిన్ మెదడులోని వాపును తగ్గించి, నాడీ కణాలను రక్షిస్తుంది. అంతేకాకుండా అల్జీమర్స్ వ్యాధి రాకుండా కూడా తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News