Grape Juice For White Hair: ద్రాక్ష రసంతో ఇలా చేస్తే.. తెల్ల జుట్టు శాశ్వతంగా మాయం..

Grape Juice For White Hair Problem Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ఎన్నో రకాల షాంపూలను వినియోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ సరైన ఫలితాలు పొందలేకపోతూ ఉంటారు. అయితే నల్ల ద్రాక్ష రెమిడిని వినియోగించడం వల్ల కూడా తెల్ల జుట్టు నుంచి ఉపశమనం కలుగుతుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 27, 2025, 01:47 PM IST
Grape Juice For White Hair: ద్రాక్ష రసంతో ఇలా చేస్తే.. తెల్ల జుట్టు శాశ్వతంగా మాయం..

Grape Juice For White Hair Problem Solution: చాలామంది ద్రాక్ష పండ్లను తినేందుకు ఎంతో ఇష్టపడతారు. ఇవి నోటి రుచికి ఎంతో తియ్యగా పుల్లగా అనిపిస్తూ ఉంటాయి. నిజానికి ద్రాక్ష పండ్లను ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో విటమిన్ సి తో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి ఇవి చర్మంతో పాటు జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. కొంతమంది ద్రాక్ష పండ్లను చర్మ సమస్యల నుంచి విముక్తి పొందడానికి కూడా వినియోగిస్తూ ఉంటారు. 

Add Zee News as a Preferred Source

నిజానికి ప్రతిరోజు ఖాళీ కడుపుతో నల్ల ద్రాక్ష తినడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అందుకే చాలామంది బరువు తగ్గే క్రమంలో తప్పకుండా నల్లద్రాక్షను జ్యూస్లా తయారు చేసుకుని అల్పాహారానికి ముందు తాగుతూ ఉంటారు. అలాగే నల్ల ద్రాక్ష రసం తాగడం వల్ల శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా సులభంగా తగ్గిపోతాయి. దీనివల్ల మనిషి బరువు తగ్గి పొట్ట చుట్టూ కొవ్వు పరిమాణాలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు కూడా బరువు తగ్గాలనుకుంటారు. ఇందులో భాగంగానే చాలామంది నల్ల ద్రాక్ష రసాన్ని తాగుతూ ఉంటారు. నిజానికి బరువు తగ్గడానికి నల్ల ద్రాక్ష కీలక పాత్ర పోషించినప్పటికీ మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు ఈ రసాన్ని తాగడం మంచిది కాదు. అలాగే డయాబెటిస్ తో బాధపడే వారు కూడా ఈ రసం తాగకూడదని కొంతమంది ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే జుట్టు సమస్యలకు ఇది ప్రభావంతంగా సహాయపడుతుంది. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

ముఖ్యంగా తీవ్ర జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ద్రాక్ష నుంచి తీసిన  రసాన్ని తలకు పట్టించి మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మసాజ్ చేయడం వల్ల సులభంగా జుట్టులోని రక్తప్రసరణ మెరుగుపడి తెల్ల జుట్టు నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది.. అలాగే ద్రాక్ష రసంతో మసాజ్ చేసిన తర్వాత కొబ్బరి నూనెతో చివరగా మసాజ్ చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు.  ద్రాక్షలో రెస్వెరాట్రాల్ వంటి అద్భుతమైన పోషకాలు లభిస్తాయి. ఇది మెదడుకు రక్తప్రసరణ మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది.. దీనివల్ల అల్జీమర్స్ వంటి న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది..

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News