)
Grapes In Summer In Telugu: వేసవిలో ఎక్కువగా లభించే ప్రూట్స్‌లో ద్రాక్ష ఒకటి.. పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఇష్టంగా వీటిని తింటూ ఉంటారు. ద్రాక్షలో విటమిన్ సితో పాటు విటమిన్ కె, విటమిన్ బి6, విటమిన్ బి1), రిబోఫ్లావిన్ (విటమిన్ బి2), నియాసిన్ (విటమిన్ బి3) అధిక మోతాదులో లభిస్తాయి. ఇందులో పాంటోథెనిక్ ఆమ్లం కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా వేసవిలో ద్రాక్ష పండ్లు తినడం చాలా మంచిది. ఇందులో చక్కెర శాతం కూడా ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిని వేసవిలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ద్రాక్ష తినడం వల్ల కలిగే లాభాలు:
1. శక్తిని పెంచుతాయి:
ద్రాక్షలో సహజ చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రక్టోజ్) పుష్కలంగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయని వారంటున్నారు. నీరసంగా అనిపించినప్పుడు లేదా వ్యాయామం తర్వాత ద్రాక్షను తీసుకోవడం వల్ల త్వరగా శక్తి లభిస్తుంది.
2. గుండె ఆరోగ్యం:
ద్రాక్షలో పాలీఫెనోల్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రక్తనాళాలు గట్టిపడకుండా చేస్తుంది.. ముఖ్యంగా ఎర్ర ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ అనే సమ్మేళనం గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుందని ఇటీవలే అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది.
3. క్యాన్సర్:
ద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని ఎంతో సులభంగా నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.. ఇటీవలే జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం, ద్రాక్షలోని రెస్వెరాట్రాల్ వివిధ రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడానికి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్‌తో పాటు ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వాటిపై ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులను కూడా నియంత్రిస్తుంది.
4. జీర్ణక్రియ సమస్యలు:
ద్రాక్షలో ఫైబర్ అధికంగా మోతాదులో లభిస్తుంది. ఇది మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను నివారించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి కూడా తోడ్పడుతుంది. ముఖ్యంగా ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.
5. రోగనిరోధక శక్తి:
ద్రాక్షలో విటమిన్ సితో పాటు ఇతర ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. తరచుగా ద్రాక్షను తీసుకోవడం వల్ల సీజనల్ జలుబతో పాటు ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షణ కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook