Guava Fruit Magic: వేసవిలో జామ పండ్లు తింటే ఒంట్లో మ్యాజిక్‌ జరుగుతుంది!

Guava Fruit Magic: వేసవికాలంలో ఉదయం పూట జామ పండ్లను తినడం ఆరోగ్యానికి ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే వివిధ పోషకాలు అనేకరకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి..అలాగే రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా సహాయపడతాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 18, 2025, 03:19 PM IST
Guava Fruit Magic: వేసవిలో జామ పండ్లు తింటే ఒంట్లో మ్యాజిక్‌ జరుగుతుంది!

Guava Fruit Magic: ఎండాకాలంలో జామ పండ్లను తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఏతో పాటు సి ఫైబర్ ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ఎండాకాలంలో వచ్చే వివిధ రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు జామ పండ్లలో మెగ్నీషియంతో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచి రక్తపోటును నియంత్రించేందుకు ఎంతో సహాయపడతాయి. తరచుగా ఎండాకాలంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జామ పండ్లను అల్పాహారంలో భాగంగా చేర్చుకోవడం ఎంతో మంచిది. జామ పండ్లను ప్రతిరోజు వేసవికాలంలో తినడం వల్ల ఇవే కాకుండా శరీరానికి మరెన్నో  అద్భుతమైన లాభాలు కలుగుతాయి.. ఆ ప్రయోజనాలు ఏమిటో? పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

జామ పండ్లలు తినడం వల్ల కలిగే లాభాలు:
శరీర చల్లదనం కోసం: 

జామ పండ్లలో నీటి శాతం ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి రోజు ఉదయాన్నే ఎండాకాలంలో జామ పనులు తినడం వల్ల శరీరం హైడ్రేటుగా తయారవుతుంది. అంతేకాకుండా డిహైడ్రేషన్ సమస్యల బారిన పడకుండా కూడా శరీరాన్ని సంరక్షిస్తుంది.. అలాగే వేడి శరీరం కలిగిన వ్యక్తులకు చలువ చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 

రోగనిరోధక శక్తి పెంచేందుకు: 
జామకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వేసవి కాలంలో రోజు దీనిని తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడాని, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చే సాధారణ జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లను నివారించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. 

రక్తపోటును నియంత్రిస్తుంది:
జామ పండ్లలో పొటాషియం కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది రక్తపోటును నివారించేందుకు, రక్త సరఫరాను మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రోజూ ఉదయం పూట వేసవికాలంలో జామ పండ్లను తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  

చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: 
జామకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా పుష్కలంగా లభించడమే.. కాకుండా ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మధుమేహాన్ని నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

జీర్ణక్రియ మెరుగుపరిచేందుకు:
జామకాయలో ఫైబర్ అధికంగా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్దకం సమస్యలను నివారించడానికి కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో తరచుగా జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తప్పకుండా అల్పాహారంలో జామ పనులను చేర్చుకోవడం ఎంతో మేలు.. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News