Guava Fruits: జామ పండ్లు ఉదయం పూట తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Guava Fruits As Tiffin: జామ పండ్లను అల్పాహారంగా తినడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించేందుకు సహాయపడతాయి. అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 28, 2025, 10:37 PM IST
Guava Fruits: జామ పండ్లు ఉదయం పూట తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Guava Fruits As Tiffin:  అల్పాహారంలో భాగంగా జామ పనులను తీసుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే జామ పండ్లలో విటమిన్ సి తో పాటు ఫైబర్ కంటెంట్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం పూట అనారోగ్యకరమైన ఆహారాలకు బదులుగా జామ పండు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిని తరచుగా జబ్బుల బారిన పడేవారు తప్పకుండా జామ పండ్లతో చేసిన రసాన్ని తాగాల్సి ఉంటుంది. అలాగే జామ పనులు దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించేందుకు సైతం ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా జాముఖండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ పొట్ట సమస్యల నుంచి గుండె సమస్యల వరకు అన్ని రకాల అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇవే కాకుండా బోలెడు లాభాలు కలుగుతాయి..
జామ పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు:
రోగనిరోధక శక్తి పెంచేందుకు.: 

జామ పండ్లలో ఎక్కువ మోతాదులో విటమిన్ సి తో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది ఇమ్యూనిటీ లెవెల్స్ ను పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉదయం పూట అల్పాహారంలో భాగంగా జామపండులను తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

Add Zee News as a Preferred Source

జీర్ణక్రియ సమస్యలకు చెక్
జామ పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది మలబద్ధకాన్ని నివారించేందుకు.. జీర్ణక్రియ రేటును పెంచేందుకు ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులో అధిక పరిమాణంలో లభించే ఫైబర్.. ప్రేగు కదలికలను సులభతరం చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతోపాటు జీర్ణ సంబంధిత వ్యాధులను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది..

డయాబెటిస్ ఉన్నవారికి ది బెస్ట్: 
డయాబెటిస్ ఉన్నవారు కూడా జామ పండ్లను అల్పాహారంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎరుపు రంగుతో కూడిన ఆమోహన్లు తినడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలోకి వస్తాయి. అలాగే మధుమేహాన్ని నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా రక్తంలోని చక్కర పరిమాణాలు పెరగడం తగ్గడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అల్పాహారంలో జామ పండ్లను చేర్చుకోండి..

గుండె సమస్యలకు చెక్: 
జామ పండులో ఉండే పొటాషియం, ఫైబర్ రక్తపోటును నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే కొలెస్ట్రాలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి తప్పకుండా జామ పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు కూడా జామ పండ్లు తినడం వల్ల అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు.

బరువు తగ్గడానికి: 
బరువు తగ్గడానికి కూడా జామ పండ్లు ఎంతో సహాయపడతాయి. ఇందులో లభించే ఫైబర్, తక్కువ కేలరీలు పొట్టలోని కొవ్వును కరిగించి శరీర పరుగున నియంత్రించేందుకు కీలకపాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సులభంగా బరువు తగ్గాలనుకునేవారు అల్పాహారంలో భాగంగా జామ పండ్ల సలాడ్ ను చేర్చుకోవడం ఎంతో మంచిది..

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News